భర్త అఫైర్ తెగిపోవాలి.. గుడిలో భార్య వింత పూజలు.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన..!
Extra Marital Affair: హైదరాబాద్‌లోని సూర్యగిరి ఎల్లమ్మ ఆలయంలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది.
భర్త అఫైర్ తెగిపోవాలి.. గుడిలో భార్య వింత పూజలు.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన..!
Extra Marital Affair : హైదరాబాద్ మహానగరంలో ఒక చిత్రవిచిత్రమైన ఘటన వెలుగుచూసింది. తన భర్త దారి తప్పి మరో మహిళతో పెట్టుకున్న వివాహేతర సంబంధం శాశ్వతంగా తెగిపోవాలని, భర్త మనసు మారి తిరిగి తన వద్దకే రావాలని కోరుతూ ఓ భార్య గుడిలో చేసిన వింత పూజలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. హైదరాబాద్‌లోని సూర్యగిరి ఎల్లమ్మ ఆలయం ఈ వింత ఘటనకు వేదికైంది.
సూర్యగిరి ఎల్లమ్మ ఆలయానికి వచ్చిన ఓ మహిళ, ఎవ్వరూ పెద్దగా గమనించని సమయంలో ఆలయంలోని ఒక పక్కకు వెళ్లి కూర్చుంది. తన భర్తకు, మరో మహిళకు ఉన్న ఇల్లీగల్ అఫైర్ ఎలాగైనా కట్ అవ్వాలనే కోరికతో ఆమె కొన్ని వింత పూజలు ప్రారంభించింది. అందుకోసం ఆమె ఇంటి నుంచే ప్రత్యేకమైన సామగ్రిని సిద్ధం చేసుకుని వచ్చింది. తన భర్త ఫోటో, ఆ రెండో మహిళ ఫోటోలతో పాటు ఒక తాడు, పసుపు, కుంకుమ, ఇతర పూజా సామగ్రిని అక్కడ పెట్టి వింతగా మంత్రాలు చదవడం మొదలుపెట్టింది. భర్తను ఆ మహిళ నుంచి విడదీసి, తన వైపు తిప్పుకోవడానికే ఆమె ఆ తాడుతో ఫోటోలను కడుతూ పూజలు చేసినట్లు తెలుస్తోంది.
సాధారణంగా అమ్మవారి ఆలయాల్లో భక్తులు కొబ్బరికాయలు కొట్టి, ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. కానీ, అందుకు భిన్నంగా ఈ మహిళ ఫోటోలు, తాళ్లతో వింతగా పూజలు చేస్తుండటాన్ని ఆలయానికి వచ్చిన ఇతర భక్తులు గమనించారు. ఆ దృశ్యాన్ని చూడగానే అక్కడ ఏదో చేతబడి లేదా 'క్షుద్రపూజలు' జరుగుతున్నాయేమోనని భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గుడి ఆవరణలో ఇలాంటి వింత తాంత్రిక పూజలు ఏంటని అంతా షాక్‌కు గురయ్యారు.
భక్తుల ద్వారా సమాచారం అందుకున్న ఆలయ సిబ్బంది ,అర్చకులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న సదరు మహిళను గట్టిగా మందలించారు. అనంతరం ఆమె పూజా సామగ్రిని అక్కడి నుంచి తొలగించి, ఆమెను ఆలయం వెలుపలికి పంపించేశారు.
భర్త అఫైర్ కట్ అవ్వాలని భార్య గుడిలో చేసిన ఈ వింత పూజల ఉదంతాన్ని అక్కడ ఉన్న కొందరు ఫోన్లలో రికార్డ్ చేయగా, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. భర్త దారి తప్పితే గుడిలో పూజలు చేయడం ఏంటి.. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వాలి కానీ అని కొందరు అంటుంటే.. భర్తను దక్కించుకోవడానికి ఆ భార్య ఎంత మానసిక క్షోభ అనుభవిస్తే ఇలాంటి వింత పనికి ఒడిగడుతుంది అంటూ మరికొందరు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా హైదరాబాద్‌లోని ఎల్లమ్మ గుడిలో జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.




