Viral: నెల రోజులు టీ మానేసిన యువతి.. ఏం జరిగిందో తెలిస్తే స్టన్.!
Viral: ఉదయం లేవగానే వేడి వేడిగా ఒక కప్పు టీ తాగనిదే చాలామందికి రోజు గడవదు. అయితే ఓ ఢిల్లీ యువతి ఏకంగా నెల రోజుల పాటు టీ తాగడం మానేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Viral: నెల రోజులు టీ మానేసిన యువతి.. ఏం జరిగిందో తెలిస్తే స్టన్.!
Viral: ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ పడితే కానీ చాలామందికి ఏ పనీ తోచదు. ఒత్తిడి తగ్గించుకోవడానికి, ఉత్సాహంగా ఉండటానికి రోజుకు నాలుగైదు కప్పుల టీ తాగేవాళ్లు మనలో చాలామందే ఉంటారు. అయితే టీకి బానిసగా మారితే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు వస్తాయని గ్రహించిన ఓ ఢిల్లీ యువతి, ఏకంగా 30 రోజుల పాటు టీ తాగడం పూర్తిగా మానేసింది. ఈ ప్రయోగం వల్ల ఆమె ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు పొందినట్లు వెల్లడించింది.
నిజానికి సంవత్సరాల తరబడి ఉన్న టీ అడిక్షన్ నుంచి బయటపడటం ఆమెకు మొదట్లో చాలా కష్టంగా అనిపించింది. టీ మానేసిన మొదటి కొన్ని రోజులు విపరీతమైన తలనొప్పి, నీరసం, అలసట తీవ్రంగా వేధించాయని ఆమె పేర్కొంది. కానీ పట్టుదలతో ఆ వ్యసనాన్ని జయించింది. క్రమంగా శరీరం దానికి అలవాటు పడటంతో కేవలం 10 రోజుల్లోనే గ్యాస్, ఎసిడిటీ లాంటి జీర్ణ సంబంధిత సమస్యలు 90 శాతం వరకు తగ్గిపోయాయని తెలిపింది.
అంతేకాకుండా రాత్రి పూట ఎలాంటి ఆటంకం లేకుండా ప్రశాంతంగా నిద్ర పడుతోందని, రోజంతా ఎంతో యాక్టివ్‌గా ఉండగలుగుతున్నానని ఆ యువతి సంతోషం వ్యక్తం చేసింది. ఆరోగ్యపరంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఆమెకు ఎంతో లాభం చేకూరింది. రోజువారీగా ఆఫీసులో, బయట టీ కోసం పెట్టే ఖర్చు ఆదా అవడంతో, నెల తిరిగేసరికి సుమారు రూ. 3,000 నుంచి 4,000 వరకు డబ్బులు మిగిలాయని వివరించింది. ఈ స్ఫూర్తిదాయకమైన స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, విపరీతంగా టీ తాగే అలవాటు ఉన్నవారిని ఆలోచించేలా చేస్తోంది.




