Viral: మంచంలో సగం అద్దెకు.! ఈ యువతి ఆఫర్ వెంటే స్టన్ అవ్వాల్సిందే..

Viral: డబ్బు సంపాదించడానికి ఎవరైనా ఇల్లు, కారు లేదా వస్తువులను అద్దెకు ఇవ్వడం చూసుంటాం. కానీ ఒక మహిళ మాత్రం ఏకంగా తన మంచంలో సగం భాగాన్ని అద్దెకు ఇస్తూ నెలకు రూ. 50 వేల వరకు సంపాదిస్తోంది.

Ravi
By Ravi
Published on: 30 Jun 2026 11:01 AM IST
Viral
X

Viral: మంచంలో సగం అద్దెకు.! ఈ యువతి ఆఫర్ వెంటే స్టన్ అవ్వాల్సిందే..

Viral: డబ్బు సంపాదించడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు.ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు చెందిన మోనిక్ జెరేమియా అనే మహిళ ఒక వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. డబ్బు సంపాదించడం కోసం ఆమె ఏకంగా తన మంచంలో సగం భాగాన్ని అద్దెకు ఇస్తోంది. ఇలా చేయడం ద్వారా ఆమె నెలకు దాదాపు రూ. 54,000 పైనే ఆదాయం పొందుతోందని సమాచారం.

కరోనా మహమ్మారి సమయంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం, తన ఉద్యోగం కోల్పోవడం, భర్తతో విడిపోయి ఒంటరిగా ఉండటంతో ఎదురైన సమస్యల కారణంగా ఆమె ఈ వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టింది.

నిబంధనలు ఇవే:

మంచం అద్దెకు తీసుకునే వ్యక్తుల ముందు మోనిక్ ఒక కఠినమైన షరతు కూడా విధించింది. మంచం షేర్ చేసుకునే వ్యక్తుల మధ్య ఎలాంటి రొమాంటిక్ లేదా శారీరక సంబంధాలకు తావులేదని స్పష్టం చేసింది. ఇద్దరి అంగీకారంతో మాత్రమే స్పర్శకు అవకాశం ఉంటుందని, ఒకరి స్పేస్‌ను మరొకరు గౌరవించాలని కచ్చితమైన బౌండరీస్ పెట్టింది. ఇలా ఎలాంటి రొమాంటిక్ ఉద్దేశాలు లేకుండా అద్దె కోసం మంచాన్ని షేర్ చేసుకోవడాన్ని 'హాట్ బెడ్డింగ్' అని అంటారు.

ఒకప్పుడు ఓడలు లేదా ఫ్యాక్టరీల్లో షిఫ్టుల వారీగా మంచాన్ని వాడుకునే ఈ పద్ధతిని, పెరుగుతున్న జీవన వ్యయాల నేపథ్యంలో మోనిక్ మళ్లీ తెరపైకి తెచ్చి తన ఆర్థిక కష్టాలను అధిగమించింది. ప్రస్తుతం ఈ 'హాట్ బెడ్డింగ్' ఐడియా నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story