Viral: షర్ట్ వల్ల ఉద్యోగం కోల్పోయిన యువతి.. ఈ తలతిక్క స్టోరీ వింటే మీరూ తిట్టుకుంటారు..

Viral: ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు ఎవరైనా చాలా పద్ధతిగా, ప్రొఫెషనల్‌గా రెడీ అయి వెళ్తారు. కానీ ఓ యువతి మాత్రం ఏకంగా 'టూ హాట్ ఫర్ ఏ జాబ్' అని రాసి ఉన్న టీ-షర్ట్ వేసుకుని ఇంటర్వ్యూకు వెళ్లింది.

Ravi
By Ravi
Published on: 18 Jun 2026 10:14 AM IST
Viral
X

Viral: షర్ట్ వల్ల ఉద్యోగం కోల్పోయిన యువతి.. ఈ తలతిక్క స్టోరీ వింటే మీరూ తిట్టుకుంటారు..

Viral: సాధారణంగా ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు తమ వస్త్రధారణ విషయంలో అత్యంత శ్రద్ధ, జాగ్రత్తలు తీసుకుంటారు. ఫార్మల్ దుస్తులు ధరించి, ఇంటర్వ్యూ చేసే అధికారుల ముందు చాలా పద్ధతిగా, ప్రొఫెషనల్‌గా కనిపించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి వేసుకునే దుస్తులు.. వారి వ్యక్తిత్వాన్ని, క్రమశిక్షణను, ఆ ఉద్యోగం పట్ల వారికి ఉన్న సీరియస్‌నెస్‌ను పరోక్షంగా కనిపించేలా చేస్తాయి.

కానీ ఒక యువతి మాత్రం ప్రొఫెషనల్ రూల్స్ అన్నింటినీ గాలికొదిలేసి, ఏకంగా ఇంటర్వ్యూ చేసే అధికారులకే దిమ్మతిరిగేలా ఒక వింతైన టీ-షర్ట్ వేసుకుని వచ్చింది. ఆమె ధరించిన ఆ టీ-షర్ట్‌పై 'టూ హాట్ ఫర్ ఏ జాబ్' అని పెద్ద అక్షరాలతో ముద్రించి ఉండటం గమనార్హం. ఇలాంటి క్యాజువల్ దుస్తుల్లో ఆమె ఇంటర్వ్యూకు వెళ్లిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. సదరు యువతి ఒక ప్రముఖ కంపెనీలో ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు వెళ్లింది. అయితే, కార్పొరేట్ ఆఫీస్ వాతావరణానికి ఏమాత్రం సరిపడని విధంగా, ఒక వీకెండ్ పార్టీకి వెళ్తున్నట్లుగా ఆ క్యాచి కోట్ రాసి ఉన్న టీ-షర్ట్ వేసుకుని నేరుగా సంబంధిత హెచ్ఆర్ అధికారుల ముందుకు వెళ్లి కూర్చుంది. ఆమె దుస్తులను, ముఖ్యంగా దానిపై రాసి ఉన్న ఆ కోట్ చూసిన ఇంటర్వ్యూ ప్యానెల్ అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

ఇలాంటి క్యాజువల్ దుస్తుల్లో, అదీ ఏమాత్రం ప్రొఫెషనలిజం లేని టీ-షర్ట్‌తో ఇంటర్వ్యూకు రావడం ఏంటని అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ చేదు అనుభవాన్ని ఆ హెచ్ఆర్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ ద్వారా పంచుకోవడంతో ఈ వ్యవహారం మొత్తం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

బహుశా తాను ఫన్నీగా, కాస్త ట్రెండీగా, డిఫరెంట్‌గా కనిపిస్తున్నానని ఆమె భావించి ఉండొచ్చు కానీ, ఆఫీస్ రూల్స్ ముందు ఆమె వేసిన ప్లాన్ పూర్తిగా బెడిసికొట్టి తీవ్ర నిరాశే మిగిలింది.

ఈ పోస్ట్‌పై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఉద్యోగం సంపాదించాలనే కనీస బాధ్యత, కెరీర్ పట్ల సీరియస్‌నెస్ ఆమెలో ఏమాత్రం కనిపించడం లేదని పలువురు మండిపడుతున్నారు. కార్పొరేట్ ఆఫీస్ అనేది ఎంతో నిబద్ధతతో పనిచేసుకునే ప్రదేశం అని, అక్కడ ఇలాంటి ఫ్యాషన్ షోలు చేయకూడదని నెటిజన్లు ఆమెకు గట్టిగా చురకలు అంటిస్తున్నారు.




Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story