World Heritage day: ప్రపంచ వారసత్వ దినోత్సవం అంటే ఏంటి.? దాని ప్రాముఖ్యత ఏంటి.? ఎందుకు నిర్వహిస్తారు.?
World Heritage day: ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వారసత్వ దినోత్సవం జరుపుకుంటారు. ప్రతీ ఏటా ఒక్కో థీమ్‌తో దీనిని నిర్వహిస్తుంటారు. ఇంతకీ వరల్డ్ హెరిటేజ్ డేని ఎందుకు నిర్వహిస్తారు.? దీని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
World Heritage day
World Heritage day: ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వారసత్వ దినోత్సవం జరుపుకుంటారు. ప్రతీ ఏటా ఒక్కో థీమ్‌తో దీనిని నిర్వహిస్తుంటారు. ఇంతకీ వరల్డ్ హెరిటేజ్ డేని ఎందుకు నిర్వహిస్తారు.? దీని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
2026 థీమ్ ఏమిటి?
మన సంస్కృతి, చరిత్ర, ప్రకృతి సంపదలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేసే రోజు ఇది. ఈ ఏడాది ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫర్ లివింగ్ హెరిటేజ్ ఇన్ కంటెక్ట్స్ ఆఫ్ కంఫ్లిక్ట్స్ అండ్ డిశాస్టర్స్ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ఈ థీమ్ ద్వారా ఒక ముఖ్యమైన సందేశం ఇస్తున్నారు. యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, సామాజిక ఉద్రిక్తతల మధ్య వారసత్వ ప్రదేశాలను రక్షించడం చాలా కష్టం అయినా, అత్యంత అవసరం కూడా.
వారసత్వ స్థలాలకు ఎదురవుతున్న సవాళ్లు
ప్రపంచంలో ఉన్న హెరిటేజ్ సైట్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. యుద్ధాలు, దేశాల మధ్య ఘర్షణలతో పాటు భూకంపాలు, వరదలు, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులు, నిర్లక్ష్యం, సరైన సంరక్షణ లేకపోవడం,
పర్యాటకుల వల్ల కలిగే నష్టం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. ఉదాహరణకు, కాంబోడియాలోని ప్రేహ్ విహేర్ దేవాలయం. థాయ్‌లాండ్, కాంబోడియా దేశాల మధ్య వివాదాల కారణంగా ఈ ఆలయం నష్టం చవిచూసింది.
ప్రపంచ వారసత్వ స్థలాలు అంటే ఏమిటి?
చారిత్రక, సాంస్కృతిక, లేదా ప్రకృతి పరంగా ప్రత్యేకమైన ప్రదేశాలను ప్రపంచ వారసత్వ స్థలాలుగా పిలుస్తారు. ఇవి ప్రపంచానికి విలువైన సంపదగా గుర్తింపు పొందినవి, భవిష్యత్ తరాల కోసం సంరక్షించాల్సిన ప్రదేశాలు. వీటిని మూడు రకాలు విభజించారు. సాంస్కృతిక స్థలాలు (ఉదా: తాజ్ మహల్), ప్రకృతి స్థలాలు (ఉదా: అరణ్యాలు, పర్వతాలు), మిశ్రమ స్థలాలు (రెండూ కలిసినవి).
UNESCO పాత్ర, దాని ప్రాముఖ్యత
ప్రపంచ వారసత్వ స్థలాలను కాపాడటంలో UNESCO కీలక పాత్ర పోషిస్తుంది. 1972లో వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ ప్రారంభించింది. ప్రత్యేక ప్రమాణాల ప్రకారం ప్రదేశాలను ఎంపిక చేస్తుంది. వాటి సంరక్షణకు మార్గదర్శకాలు ఇస్తుంది. 2025 నాటికి ప్రపంచంలో సుమారు 1,248 హెరిటేజ్ సైట్లు ఉన్నాయి. భారతదేశంలో ప్రస్తుతం 42 వరల్డ్ హెరిటేజ్ సైట్లు ఉన్నాయి.
వారసత్వ స్థలాల ప్రాముఖ్యత
ప్రపంచ వారసత్వ స్థలాలు మన చరిత్ర, సంస్కృతిని కాపాడడంలో ఉపయోగపడతాయి. పర్యాటకాన్ని పెంచి ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తాయి. భవిష్యత్ తరాలకు జ్ఞానం అందిస్తాయి, ప్రకృతి సంరక్షణకు సహాయపడతాయి. అందుకే ప్రపంచ వారసత్వ స్థలాలు కేవలం ప్రదేశాలు కాదు.. అవి మన గతం, మన సంస్కృతి, మన గర్వం. వాటిని కాపాడటం మన బాధ్యత.




