Viral: ఓవర్‌స్పీడ్ వెళ్లినందుకు రూ. 2,000 చలానా.. కట్ చేస్తే.. లొకేషన్ ఎక్కడని చూడగా షాక్.!

Viral: యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో 100 కి.మీ. వేగ పరిమితి ఉన్నచోట గంటకు 101 కి.మీ. వేగంతో వెళ్లినందుకు రూ. 2,000 ఈ-చలాన్ వచ్చిందని, పైగా స్పీడ్ కెమెరా లొకేషన్ అట్లాంటిక్ సముద్రం మధ్యలో చూపించిందని ఓ వాహనదారుడు చేసిన పోస్ట్ వైరల్ కావడంతో కెమెరా ఖచ్చితత్వం, వేగ సహనంపై చర్చ మొదలైంది.

Ravi
By Ravi
Updated on: 14 Nov 2026 3:42 PM IST
Viral
X

Viral: ఓవర్‌స్పీడ్ వెళ్లినందుకు రూ. 2,000 చలానా.. కట్ చేస్తే.. లొకేషన్ ఎక్కడని చూడగా షాక్.!

Viral: యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో అనుమతించిన వేగ పరిమితి కంటే గంటకు కేవలం ఒక కిలోమీటర్ ఎక్కువ వేగంతో వెళ్లినందుకు రూ. 2,000 చలాన్ వచ్చిందంటూ ఓ వాహనదారుడు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అయింది. తన కారు వేగం గంటకు 101 కి.మీ. అని, పరిమితి గంటకు 100 కి.మీ. అని ఆయన పేర్కొన్నారు. కేవలం 1 కి.మీ అంతే అంటూ నోయిడా ట్రాఫిక్, యూపీ ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేస్తూ 'రోడ్డు భద్రత నిజంగా ఇలాగే ఉంటుందా?' అని ప్రశ్నించారు.

ఇందులో మరో విచిత్రం కూడా ఉంది. వేగాన్ని రికార్డ్ చేసిన స్పీడ్ గన్ లొకేషన్‌ను 0°N, 0°E అని చూపించిందని ఆయన చెప్పారు. ఆ అక్షాంశ, రేఖాంశాలు అట్లాంటిక్ సముద్రం మధ్యలో ఉంటాయి. చలాన్‌లో పేర్కొన్న ప్రదేశం యమునా ఎక్స్‌ప్రెస్‌వే కాకుండా సముద్రం మధ్యలో ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన ఏఐ కెమెరాల ఖచ్చితత్వంపై ప్రశ్నలు లేవనెత్తింది.

యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో కార్లు, చిన్న వాహనాలకు వేగ పరిమితి గంటకు 100 కి.మీ, భారీ వాహనాలకు గంటకు 60 కి.మీ. ఈ మార్గంలో జెవార్ టోల్ ప్లాజా వద్ద ఉన్న ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెంటర్‌కు కెమెరాలు అనుసంధానమై ఉంటాయి. గంటకు 100 కి.మీ. కంటే ఎక్కువ వేగంతో వెళ్లే వాహనాలను కెమెరాలు రికార్డ్ చేస్తాయి. ఈ వ్యవస్థ ఈ-చలాన్, వాహన్ యాప్‌లతో అనుసంధానమై ఉంటుంది. 2018లో ఈ మార్గంలో చర్యలు కఠినతరం చేసినప్పుడు రెండు నెలల్లోనే 50,056 చలాన్లు జారీ అయ్యాయి. అప్పట్లో వేగానికి పడే జరిమానా రూ. 400.

ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అనుమతించిన వేగ పరిమితిపై కొంత సహనం ఉంటుందని, కొందరు చెబుతున్నారు. కనీసం 5 శాతం వరకు వెసులుబాటు ఉందన్నది వారి వాదన. అలాంటప్పుడు గంటకు ఒక కిలోమీటర్ అధికంగా వెళ్లినందుకు జరిమానా వేయడం చట్టబద్ధమేనా అని కొందరు ప్రశ్నించారు. మరికొందరు నిబంధన నిబంధనే అని, ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని వాదించారు. ఈ ఆరోపణలపై నోయిడా ట్రాఫిక్ పోలీసులు లేదా యూపీ ట్రాఫిక్ పోలీసుల నుంచి అధికారిక స్పందన రిపోర్టుల్లో కనిపించలేదు.




Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.