Viral Video: ఇది రైల్వే స్టేషనా లేక స్వర్గమా?: నెట్టింట హల్చల్ చేస్తున్న 'యోగ్ నగరి రిషికేశ్' విజువల్స్!
Viral Video: ఉత్తరాఖండ్‌లోని యోగ్ నగరి రిషికేశ్ రైల్వే స్టేషన్ సోషల్ మీడియాలో వైరల్. పచ్చని కొండలు, ప్రకృతి ఒడిలో బాలీవుడ్ సెట్‌ను తలపిస్తున్న స్టేషన్ దృశ్యాలు.
Viral Video: ఇది రైల్వే స్టేషనా లేక స్వర్గమా?: నెట్టింట హల్చల్ చేస్తున్న 'యోగ్ నగరి రిషికేశ్' విజువల్స్!
Viral Video: భారతీయ రైల్వేల్లో సరికొత్త అధ్యాయానికి ప్రతీకగా నిలిచిన ఉత్తరాఖండ్‌లోని ‘యోగ్ నగరి రిషికేశ్’ రైల్వే స్టేషన్ ప్రస్తుతం నెట్టింట నెటిజన్ల మనసులను దోచుకుంటోంది. చుట్టూ దట్టమైన పచ్చని కొండలు, సుందరమైన పర్వతాల నడుమ కొలువైన ఈ స్టేషన్ దృశ్యాలు ప్రయాణికులకు భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయి.
ఇటీవల ఓ ప్రముఖ కంటెంట్ క్రియేటర్ రిషికేశ్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ స్టేషన్ అందాలను కెమెరాలో బంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ సినిమాల్లో కనిపించే రిచ్ లొకేషన్ల మాదిరిగా ఈ స్టేషన్ ఉందంటూ ఆయన అభివర్ణించగా, ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది.
సాధారణంగా నగరాల్లో కాంక్రీట్ నిర్మాణాలు, రద్దీతో ఉండే స్టేషన్లకు భిన్నంగా ఇది పూర్తిగా ప్రకృతి ఒడిలో నిర్మించబడింది. స్టేషన్‌లోని పరిశుభ్రత, ఆధునిక వసతులు ప్రయాణికులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ప్రతిష్ఠాత్మక 'చార్ ధామ్' ప్రాజెక్టు మరియు 'రిషికేశ్-కర్ణప్రయాగ్' నూతన రైల్వే లైన్లో భాగంగా 2021లో ఈ స్టేషన్‌ను ప్రారంభించారు. ఇది రిషికేశ్ పట్టణానికి పశ్చిమ దిశలో ఉంది.
స్టేషన్ ప్లాట్‌ఫాంపై నిలబడితే చుట్టూ కనిపించే పచ్చని పర్వతాల దృశ్యాలు దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేస్ ఆధునీకరణ తీరుపై నెటిజన్లు చర్చించుకునేలా చేస్తున్నాయి.




