Viral Video: ఈత కొట్టేందుకు పూల్‌లోకి జంప్.. కట్ చేస్తే.. యువకుడు మృతి

Viral Video: అత్యుత్సాహం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మహారాష్ట్రలోని ఓ రిసార్ట్‌లో స్విమ్మింగ్ పూల్‌లోకి ఎత్తు నుంచి దూకిన ఓ యువకుడు పూల్ లోతు తక్కువగా ఉండటంతో ప్రాణాలు కోల్పోయాడు.

Ravi
By Ravi
Updated on: 28 Jun 2026 3:15 PM IST
Viral Video
X

Viral Video: ఈత కొట్టేందుకు పూల్‌లోకి జంప్.. కట్ చేస్తే.. యువకుడు మృతి

Viral Video: అత్యుత్సాహంతో, ముందు వెనుక ఆలోచించకుండా చేసే పనులు ఒక్కోసారి ఎలాంటి ఘోర ప్రమాదాలకు దారితీస్తాయో చెప్పడానికి ఈ ఘటనే సాక్ష్యం. సరదాగా స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడానికి వెళ్లిన ఓ యువకుడు, క్షణికావేశంలో చేసిన చిన్న పొరపాటు వల్ల తన నిండు ప్రాణాలనే కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని మాల్వాన్ ప్రాంతంలో ఉన్న ఓ రిసార్ట్‌కు కొంతమంది స్నేహితులు సరదాగా గడిపేందుకు వెళ్లారు. అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో వారంతా ఈత కొడుతూ ఆడుకుంటున్నారు. ఆ సమయంలో ఓ యువకుడు అత్యుత్సాహంతో కొంత ఎత్తుగా ఉన్న ప్రదేశం నుంచి నేరుగా పూల్‌లోకి డైవ్ చేశాడు. అయితే అతను దూకిన ప్రదేశంలో పూల్ లోతు చాలా తక్కువగా ఉంది. ఈ విషయం ముందే గమనించకుండా అతను ఒక్కసారిగా దూకేయడంతో, పూల్ అడుగు భాగానికి అతడి తల అత్యంత బలంగా తాకింది.

దీంతో ఆ యువకుడు తీవ్రంగా గాయపడి నీటిలోనే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇది గమనించిన స్నేహితులు వెంటనే అతడిని పూల్ బయటకు తీసి హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆలస్యం కావడంతో చికిత్స అందించేలోపే అతడు ప్రాణాలు విడిచాడు. తలకు బలమైన గాయం కావడం వల్లే మరణించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. స్విమ్మింగ్ పూల్స్ లేదా వాటర్ పార్కులకు వెళ్లినప్పుడు లోతు ఎంత ఉందో కచ్చితంగా తెలుసుకున్న తర్వాతే నీటిలోకి దిగాలని, ఇలా గుడ్డిగా సాహసాలు చేయకూడదని ఈ ఘటన ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తోంది.



Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story