Shiva Idol Mystery: ఇది సినిమా కథ కాదు... ఆయుష్షును 12 సంవత్సరాలకు పెంచే 28450 ఏళ్లనాటి విగ్రహం కథ...
28,450 ఏళ్ల నాటి పరమశివుడి కల్ప రసాయన విగ్రహం చుట్టూ ప్రచారంలో ఉన్న ఆధ్యాత్మిక గాథ, టిబెట్ నుంచి అమెరికా వరకు సాగిన రహస్య ప్రయాణం, సీఐఏ, కార్బన్ డేటింగ్, అమృత తీర్థం విశ్వాసాలపై ఆసక్తికర కథనం.
Shiva Idol Mystery: చైనా దురాక్రమణతో టిబెట్ అతలాకుతలమవుతున్న 1959 నాటి రోజులవి. ఆధ్యాత్మికతకు నిలయమైన ఆ పవిత్ర భూమిపై సంక్షోభం ముసురుతున్న వేళ, ఒక వృద్ధ బౌద్ధ భిక్షువు తన ప్రాణాలకంటే మిన్నగా దాచిన ఒక రహస్య పెట్టెను సీఐఏ ఏజెంట్‌కు అప్పగించారు. తరతరాలుగా గుప్తంగా కాపాడుకుంటూ వస్తున్న ఆ పెట్టెను సురక్షిత ప్రాంతానికి తరలించాలన్నది ఆయన కోరిక. అలా టిబెట్‌లోని మోన్తాంగ్ నుండి భారతదేశంలోని రహస్య ఎయిర్‌బేస్ మీదుగా వాషింగ్టన్‌లోని సీఐఏ ప్రధాన కార్యాలయానికి చేరిన ఆ పెట్టె, ప్రపంచ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాన్ని బయటపెట్టింది.
పెట్టెలో పరమశివుడు ... సైన్స్‌ను సైతం విస్మయపరిచిన సత్యం
అత్యంత సుందరమైన పూల డిజైన్లతో, లోపల రేకు తాపడాలు కలిగిన ఆ టేకు పెట్టెను తెరిచిన అధికారులకు కేవలం 47.10 గ్రాముల బరువు, 8 అంగుళాల ఎత్తు కలిగిన ఒక చిన్న కాంస్య పరమశివుడి విగ్రహం, దానితో పాటు పురాతన లిపితో ఉన్న ఒక కొయ్య పలక లభించాయి. ఆ లిపిని డీకోడ్ చేసిన పరిశోధకులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. అది సాదాసీదా విగ్రహం కాదు... కృతయుగంలో మునుల రక్షణార్థం ఆ పరమేశ్వరుడే ప్రసాదించిన "కల్ప రసాయన అమృత విగ్రహం".
ఇక పెట్టె లోపల కొయ్యపలకపై రాసి ఉంచిన దాని ప్రకారం... ఈ విగ్రహాన్ని ఒక నియమిత కాలం పాటు నీటిలో ఉంచి, ఆ తీర్థాన్ని సేవించినట్లయితే మనుషుల ఆయుష్షు ఏకంగా 120 సంవత్సరాలకు పెరుగుతుంది. అంతుచిక్కని వ్యాధుల నుండి విముక్తి కలిగి, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. దీని ప్రాచీనతను తెలుసుకోవడానికి అమెరికా శాస్త్రవేత్తలు కార్బన్ డేటింగ్ పరీక్షలు నిర్వహించగా నమ్మశక్యం కాని నిజం వెలుగుచూసింది. ఆ విగ్రహం వయసు 28,450 సంవత్సరాలు! అంటే మహాభారత కాలానికంటే దాదాపు 23 వేల సంవత్సరాల క్రితం నాటిదన్నమాట. భూమిపై లభించిన అత్యంత పురాతన విగ్రహంగా ఇది చరిత్రకెక్కింది.
మాయమైన దైవశక్తి...
ఈ అమృత విగ్రహాన్ని సీఐఏ అత్యంత రహస్యంగా భద్రపరిచినప్పటికీ, 1996వ సంవత్సరంలో ఇది అమెరికా నుండి హఠాత్తుగా మాయమైంది. అయితే, దైవిక శక్తులు కలిగిన ఇటువంటి పవిత్ర వస్తువులు ఎక్కువ కాలం పరాయి దేశాల్లో ఉండలేవని, కలియుగ ప్రభావం నుండి రక్షించుకోవడానికి ఆ మహాశివుడే తిరిగి తన స్వస్థానమైన భారతదేశానికి చేరుకున్నాడని భక్తుల విశ్వాసం. సృష్టి, స్థితి, లయకారకుడైన ఆ భోళాశంకరుడిని నిష్కల్మషమైన మనసుతో పూజించే భక్తుల చెంతనే, సనాతన ధర్మం వర్ధిల్లే పుణ్యభూమిలోనే ఈ విగ్రహం ప్రస్తుతం గుప్తంగా ఉంటూ లోకాన్ని రక్షిస్తోందని ఆధ్యాత్మిక పండితులు నమ్ముతున్నారు. దైవశక్తి సత్యమైనదని చెప్పడానికి ఈ 'కల్ప రసాయన' విగ్రహ కథే నిలువెత్తు సాక్ష్యం.




