360 Degree Rotating Shiva Linga: మన పూర్వీకులు చెప్పిన పురాతన శివలింగం...గుండ్రంగా తిప్పితే జాతకం మారడం ఖాయం

సైన్స్‌కి అందని, మన భక్తికి మాత్రమే లొంగిపోయే గుండ్రంగా తిరిగే శివలింగాన్ని దర్శించుకుంటే జాతకం మారిపోతంది. ఈ ఆలయం విశేషాలు తెలుసుకుందాం.

Balachander
Published on: 4 Jun 2026 11:06 AM IST
360 Degree Rotating Shiva Linga: మన పూర్వీకులు చెప్పిన పురాతన శివలింగం...గుండ్రంగా తిప్పితే జాతకం మారడం ఖాయం
X

360 Degree Rotating Shiva Linga: భరతభూమిలో ఎన్నో పురాతనమైన దేవాలయాలు న్నాయి. అందులో మహాశివుడికి ఉన్న ఆలయాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జ్యోతిర్లింగాలు, పంచభూతలింగాలు, పంచారామాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అంతేకాదు, సైన్స్‌కి అందని క్షేత్రాలు కూడా ఎన్నో. అలాంటి వాటిల్లో ఒకటి గుండ్రంగా తిరిగే శివలింగం. తిరుగుందా లేదా అని తిప్పితే ఒక్క అంగులం కూడా కదలదు. కానీ, భక్తితో మీరు ఒక్కసారి తిప్పితే చాలు గుండ్రంగా తిరుగుతుంది. ఈ కలియుగంలో ఇలాంటి క్షేత్రాలు కూడా ఉన్నాయా అని మనం ఆశ్చర్యపోతాం. మరి ఈ క్షేత్రం ఎక్కడుందో ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

బత్తీస్ మందిరం .... 32 స్తంభాల అద్భుతం

ఈ రహస్యమైన శివలింగాన్ని దర్శించాలంటే మనం ఛత్తీస్‌గఢ్‌ జిల్లాలోని బర్సూర్‌ అనే ప్రాంతానికి వెళ్లాలి. అక్కడే బత్తీస్‌ ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని సామాన్యశకం 1208లో రాజమహర్షి గంగ మహాదేవి నిర్మించినట్లుగా చరిత్ర చెబుతున్నది. ఈ ఆలయంలో మొత్తం 32 స్తంభాలు, రెండు గర్భగుడులు ఉంటాయి. ఒకే ఆలయ ప్రాంగణంలో ఇలా రెండు గర్భగుడులు ఉండటం చాలా అరుదైన విషయం. సాధారణంగా శివాలయాల్లో శివుడు ఉత్తరముఖంగా దర్శనం ఇస్తాడు. శివలింగం రూపంలో స్థిరంగా ఉంటాడు. కానీ, ఈ బత్తీస్‌ శివాలయంలో శివుడిని మనం ఏదిశకు కావాలంటే ఆ దిశకు సులభంగా తిప్పవచ్చు. అయితే, ఇది భక్తితో మాత్రమే సాధ్యమౌతుంది.

రామేశ్వరాలయం .... శ్రీరాముడు ప్రతిష్టించిన లింగం

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహాకాళేశ్వరాలయం నుంచి కేవలం 500 కిలోమీటర్ల దూరంలోనే ఈ బత్తీస్‌ ఆలయం ఉంటుంది. లంకాధిపతియేన రావణాసుడిని వధించిన తరువాత బ్రహ్మహత్యాపాతకం నుండి బయటపడేందుకు శ్రీరాముడు, సీతాదేవి లక్ష్మణుడితో కలిసి ఇక్కడ ఈ రామేశ్వరాలయంలో శివలింగాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారని పురాణాలు చెబుతున్నాయి. శివలింగం పైభాగాన్ని కదిపితే ఏమాత్రం కదలదు. కానీ, పానమట్టం నుండి ఈ శివలింగాన్ని తిప్పాలి. పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ తిప్పినపుడు మాత్రమే ఈ శివలింగం గుండ్రంగా తిరుగుతుంది. సాధారణంగా కదులుతుందో లేదో చూద్దామని, లేదా దేవుడిని పరీక్షిద్దామని తిప్పితే ఏమాత్రం కదలదు.

జాతకం మారుతుందా? భక్తుల విశ్వాసం ఇదే!

ఇక్కడి శివలింగాన్ని మంత్రబలంతో గుండ్రంగా తిప్పుతున్నప్పుడు ఆయా దిశల్లో ఉండే జ్యోతిర్లింగాలు సూక్ష్మరూపంలో గోచరిస్తాయి. ఇక అత్యంత పవిత్రమైన శ్రావణంలో ఇక్కడ ప్రవహించే శిప్రానదిలో స్నానం చేసి శ్రీరామేశ్వ స్వామిని దర్శించుకొని శివలింగాన్ని తిప్పితే దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించిన పుణ్యఫలం లభిస్తుంది. ఇక్కడి ఆలయంలోని రెండు గర్భగుడుల్లో కొలువైన మహిమాన్విత శివలింగాలను దర్శించుకొని, స్వామిపై అపారమైన నమ్మకాన్ని కనబరిస్తే...సమస్త కోరికలు నెరవేరుతాయని, జాతకంలో దోషాలు తొలగిపోయి జీవితం మారిపోతుందని పండితులు చెబుతున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story