Ashada Masam: ఆషాఢంలో ఈ పనులు చేస్తున్నారా...ఆ దేవుడు కూడా కాపాడలేడు
శూన్యమాసంగా పిలిచే ఆషాఢంలో ఎట్టిపరిస్థితుల్లోనూ కొన్ని పనులు చేయకూడదు. ఈ మాసంలో చేయవలసిన పనులు ఏమిటో, చేయకూడనివి ఏమిటో తెలుసుకుందాం.
Ashada Masam: తెలుగు మాసాల్లో ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ఈ మాసాన్ని లౌకిక వ్యవహారాల్లో మాత్రం 'శూన్య మాసం'గా పరిగణిస్తారు. ఈ కాలంలో వర్ష రుతువు ప్రారంభమై వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి. ప్రకృతిలో వచ్చే ఈ మార్పుల వల్ల మానవ శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గి, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే మన పెద్దలు ఆషాఢ మాసంలో కొన్ని కఠినమైన నియమాలను విధించారు. ఈ మాసంలో చేయకూడని పనులను నిర్లక్ష్యం చేసి పొరపాట్లు చేస్తే, ఆ దేవుడు కూడా మనల్ని అనారోగ్యాల నుండి, దోషాల నుండి కాపాడలేడని స్వయంగా శాస్త్రాలే హెచ్చరిస్తున్నాయి. ఇక ఈ ఆషాఢంలో పాటించాల్సిన ముఖ్యమైన నిషిద్ధాలు, నియమాలు ఏమిటో ఇప్పుడు సూటిగా తెలుసుకుందాం.
ఆషాఢంలో పొరపాటున కూడా చేయకూడని ముఖ్యమైన పనులు
ఆషాఢ మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు లాంటి ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన జంటలను ఈ నెల రోజులు దూరంగా ఉంచుతారు. కొత్త కోడలు అత్తగారి ఇంట్లో ఉండకుండా పుట్టింటికి వెళ్లాలనే నియమం ఉంది. దీని వెనుక శాస్త్రీయ కోణం ఉంది. ఈ మాసంలో స్త్రీ గర్భం దాలిస్తే, కడుపులో పెరిగే బిడ్డ చలికాలం, ఎండకాలం ముదిరే సమయంలో జన్మిస్తుంది. ఆ వాతావరణం పసిబిడ్డ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అందుకే ఈ నియమాన్ని పెట్టారు. అంతేకాదు, ఈ మాసంలో జీర్ణశక్తి చాలా మందగిస్తుంది. కాబట్టి ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఆకుకూరలు, బెండకాయలు, మాంసం, చేపలు, మద్యం వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి. రాత్రి వండిన చద్ది ఆహారాన్ని అస్సలు తినకూడదు. ఆలస్యంగా నిద్రపోవడం కూడా ఆరోగ్యానికి చేటు చేస్తుంది. ఇక ఈ ఆషాఢంలో పుణ్య నదులలో లేదా సముద్రంలో స్నానం చేయడం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయి. ఈ మాసంలో లక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువును, దుర్గాదేవిని, కుజ గ్రహాన్ని భక్తిశ్రద్ధలతో పూజించాలి.
పెద్దల మాట చద్దన్నం మూట
ఆషాఢం అంటే కేవలం మూఢనమ్మకం కాదు. అది మన ఆరోగ్యాన్ని, వంశాభివృద్ధులను కాపాడే ఒక దివ్యమైన రక్షణ కవచం. ఈ ఆషాఢంలోనే తెలంగాణలో బోనాలు ప్రారంభం అవుతాయి. అమ్మవారికి బోనం సమర్పించడం వలన ఆరోగ్యంతో పాటు అమ్మవారి దయతో అనుకున్న లక్ష్యాలను సాధించగలగుతాం. అంతేకాదు, ఈ ఆషాఢంలో జరిగే అతి ముఖ్యమైన పండుగ పూరీ జగన్నాథుడి రథోత్సవం. ఆ జగన్నాథుడు స్వయంగా భక్తులను చూసేందుకు రథమెక్కి వస్తారు కాబట్టి ఆయన్ను దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని మన పూర్వీకులు, పురాణాలు చెబుతున్నాయి.
గమనికః ఇక్కడ ఇచ్చిన సమాచారం అంతర్జాలంలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే రూపొందించబడింది. దీనిని పూర్తిగా తెలుసుకోవడానికి నిపుణులైన పండితులను సంప్రదించడం మంచిది.




