August 2026: ఆగస్టులో మహాద్భుతం... ఈ శుభసమయాల్లో ఏ పనులు మొదలుపెట్టినా విజయమే

ఆగస్టు నెలలో శుభముహూర్తాలు, శుభ సమయాల గురించి తెలుసుకుందాం. ఆషాఢంతో పాటు శ్రావణం కూడా ఈ మాసంలో ఉండటంతో వివాహాలకు ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయో తెలుసుకుందాం.

Balachander
Published on: 31 July 2026 10:19 AM IST
August 2026: ఆగస్టులో మహాద్భుతం... ఈ శుభసమయాల్లో ఏ పనులు మొదలుపెట్టినా విజయమే
X

August 2026: ఆగస్టు నెలలో సగం రోజులు బహుళ పక్ష అషాఢం ఉంటుంది. ఈ ఆషాఢంలోనే తెలంగాణలో బోనాలు జరుగుతున్నాయి. బోనాలకు విశేషమైన ప్రాధాన్య ఉంటుంది. సాధారణంగా ప్రతి ఏడాది శ్రావణమాసం జులై నెలలోనే ప్రారంభం అవుతుంది. కానీ, ఈ ఏడాది అధికమాసం రావడంతో శ్రావణం ఆలస్యంగా ప్రారంభం అవుతున్నది. ఆగస్టు 13వ తేదీ గురువారంతో శ్రావణమాసం ప్రారంభం అవుతుంది. శ్రావణమాసం ప్రారంభానికి ముందు ఆగస్టు 9న ఏకాదశి తిథి ఉన్నది. ఆగస్టులో వచ్చే ఈ ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ కామిక ఏకాదశి రోజున నిష్టతో ఉపవాసం ఉండి ఏ పనిచేసినా ఫలితం లభిస్తుంది.

అదేవిధంగా ఆగస్టు 9వ తేదీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బోనాల పండుగ జరుగుతుంది. ఆగస్టు 10వ తేదీన రంగం నిర్వహిస్తారు. ఇక ఆగస్టు 11వ తేదీ మంగళవారం రోజున సావన్‌ శివరాత్రి వచ్చింది. ఈరోజు ఉపవాసం ఉండి మహాశివుడిని ఆరాధిస్తే ఆరోగ్యపరమైన దోషాలు తొలగిపోతాయి. ఆగస్టు 13 గరువారం నుంచి శ్రావణమాసం ప్రారంభం అవుతుంది.

శ్రావణలో శుభ సమయాలు...ముహూర్తాలు

శ్రావణమాసం శివకేశవులు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైనదే. ఈ మాసంలో ఏ చిన్న పని తలపెట్టినా అది విజయవంతమౌతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, దానధర్మాలకు, పూజలకు అత్యంత ప్రసిద్ది. ఈ మాసంలో చేసే దానధర్మాలు వెయ్యిరెట్లు పుణ్యఫలితాలను ఇస్తుంది. ఇక ఈ శ్రావణంలో సోమ, మంగళ, శుక్ర, శనివారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజుల్లో ఏ కొత్త కార్యక్రమాలు చేపట్టినా, నూతన వాహనాలు కొనుగోలు చేసేందుకు అనుకూలమైనవిగా పండితులు చెబుతున్నారు. ఇక శనివారాలు కూడా ఎంతో ప్రీతికరమైనవి. శనివారాల్లో శ్రీమహావిష్ణువును ఆరాధిస్తారు.

ఇక ఇదిలా ఉంటే, చాతుర్మాస్య కాలం కారణంగా ఈ ఆగస్టునెలలో గృహప్రవేశాలకు అనుకూలమైన ముహూర్తాలు లేవు. కానీ, వివాహాలకు సంబంధించి కొన్ని ముహూర్తాలు ఉన్నాయి. ఆగస్టు 14, 17, 21,23,26, 27, 31 తేదీలు వివాహాలను అనుకూలమైన తేదీలు. అయితే, ఏ శుభకార్యం మొదలుపెట్టినా జన్మతేదీ, రాశి ఆధారంగా శుభముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. ఇక ఈ శ్రావణమాసంలో సాయంత్రం వేళ పూజామందిరంలో తప్పనిసరిగా ఆవునెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లో స్థిరనివాసం ఏర్పరుచుకుంటుందని పండితులు చెబుతున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story