April: పెళ్లి ముహుర్తం ఎందుకు ముఖ్యం.? ఏప్రిల్‌లో మంచి రోజులు ఏవి.?
April: హిందూ సంప్రదాయంలో వివాహాన్ని జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా భావిస్తారు. అందుకే పెళ్లి వంటి శుభకార్యాలకు సరైన ముహూర్తాన్ని ఎంపిక చేయడం చాలా కీలకం. తిథి, నక్షత్రం, గ్రహస్థితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని శుభ సమయాలను నిర్ణయిస్తారు.
April: పెళ్లి ముహుర్తం ఎందుకు ముఖ్యం.? ఏప్రిల్‌లో మంచి రోజులు ఏవి.?
April: హిందూ సంప్రదాయంలో వివాహాన్ని జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా భావిస్తారు. అందుకే పెళ్లి వంటి శుభకార్యాలకు సరైన ముహూర్తాన్ని ఎంపిక చేయడం చాలా కీలకం. తిథి, నక్షత్రం, గ్రహస్థితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని శుభ సమయాలను నిర్ణయిస్తారు. 2026 ఏప్రిల్ నెలలో కూడా కొన్ని ప్రత్యేకమైన వివాహ ముహూర్తాలు ఉన్నాయి.
ఖర్మాసం అంటే ఏమిటి? ఎందుకు శుభకార్యాలు చేయరు?
హిందూ పంచాంగం ప్రకారం ఖర్మాసం కాలాన్ని శుభకార్యాలకు అనుకూలంగా పరిగణించరు. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, ముఖ్యంగా వివాహాలు, నిశ్చితార్థాలు వంటి కార్యక్రమాలు సాధారణంగా నిర్వహించరు.
2026లో ఖర్మాసం మార్చి 14న ప్రారంభమై ఏప్రిల్ 14తో ముగుస్తుంది. ఈ సమయంలో సూర్యుడు మీనరాశిలో సంచరిస్తాడు. జ్యోతిష్య పరంగా ఈ కాలాన్ని ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైనదిగా భావిస్తారు కానీ వివాహాల వంటి ముఖ్య కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉండటం మంచిదని పండితులు సూచిస్తారు. ఖర్మాసం పూర్తయిన తర్వాతే మళ్లీ శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయి.
పెళ్లి ముహూర్తం ఎందుకు ముఖ్యమో తెలుసా?
వివాహం కేవలం ఇద్దరి వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాల కలయికగా భావిస్తారు. అందుకే సరైన ముహూర్తంలో పెళ్లి జరిపితే దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగుతుందని నమ్మకం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తిథి, నక్షత్రం, లగ్నం, గ్రహస్థితి వంటి అంశాలు కలిసొస్తే అది శుభ సమయంగా భావిస్తారు. పెళ్లి తేదీని నిర్ణయించే ముందు వధూవరుల జాతకాలు పరిశీలించడం కూడా సంప్రదాయంగా జరుగుతుంది.
ఏప్రిల్ 2026లో వివాహాలకు అనుకూలమైన తేదీలు
ఖర్మాసం ముగిసిన తర్వాత ఏప్రిల్ రెండో భాగంలో కొన్ని శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఆ తేదీలు, సమయాలు ఇలా ఉన్నాయి.
1) ఏప్రిల్ 15, 2026 – బుధవారం
మధ్యాహ్నం 3:22 నుంచి రాత్రి 10:31 వరకు
నక్షత్రం: ఉత్తర భాద్రపద
తిథి: త్రయోదశి
2) ఏప్రిల్ 20, 2026 – సోమవారం
ఉదయం 5:51 నుంచి సాయంత్రం 5:49 వరకు
నక్షత్రం: రోహిణి
తిథి: తృతీయ, చతుర్థి
3) ఏప్రిల్ 21, 2026 – మంగళవారం
ఉదయం 5:50 నుంచి మధ్యాహ్నం 12:31 వరకు
తిథి: పంచమి
4) ఏప్రిల్ 25 – 26, 2026 (శనివారం – ఆదివారం మధ్య)
రాత్రి 2:10 నుంచి ఉదయం 5:45 వరకు
తిథి: దశమి
5) ఏప్రిల్ 27, 2026 – సోమవారం
రాత్రి 9:18 నుంచి 9:36 వరకు
నక్షత్రాలు: ఉత్తర ఫల్గుణి, పూర్వ ఫల్గుణి
తిథి: ద్వాదశి
6) ఏప్రిల్ 28 – 29, 2026 (మంగళవారం – బుధవారం మధ్య)
రాత్రి 9:04 నుంచి ఉదయం 5:42 వరకు
నక్షత్రాలు: ఉత్తర ఫల్గుణి, హస్త
తిథి: త్రయోదశి
7) ఏప్రిల్ 29, 2026 – బుధవారం
ఉదయం 5:42 నుంచి రాత్రి 8:52 వరకు
నక్షత్రం: చిత్త
తిథులు: త్రయోదశి, చతుర్దశి
పంచాంగంలో ఇచ్చిన శుభ సమయాలు సాధారణంగా అందరికీ వర్తించే విధంగా ఉంటాయి. కానీ ప్రతి వ్యక్తి జాతకం వేర్వేరు ఉంటుంది. అందువల్ల పెళ్లి తేదీని ఖరారు చేసే ముందు వధూవరుల రాశి, నక్షత్రం, జాతక అనుకూలత వంటి అంశాలను పండితులతో పరిశీలించడం అవసరం. సరైన జాతక సరిపోలికతో పాటు శుభ ముహూర్తం ఎంపిక చేస్తే దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుందని పెద్దలు విశ్వసిస్తారు.




