Chanakya Niti: ఈ 5 విషయాలు భార్యకు కూడా చెప్పొద్దు.. చాణ‌క్యుడు ఏం చెప్పారంటే

Chanakya Niti: భారత చరిత్రలో గొప్ప తత్వవేత్తలలో ఒకరు ఆచార్య చాణక్యుడు. రాజకీయాలు, వ్యక్తిగత జీవితం, సామాజిక సంబంధాలు వంటి అనేక విషయాలపై ఆయన ఇచ్చిన సూచనలు ఇప్పటికీ మార్గ నిర్దేశం చేస్తుంటాయి. చాణక్య నీతి ప్రకారం భార్యకు కూడా చెప్పకూడని ఐదు ముఖ్యమైన విషయాలు ఏమిటో చూద్దాం.

Mokshith
Published on: 14 March 2026 5:26 PM IST
Chanakya Niti: ఈ 5 విషయాలు భార్యకు కూడా చెప్పొద్దు.. చాణ‌క్యుడు ఏం చెప్పారంటే
X

Chanakya Niti: ఈ 5 విషయాలు భార్యకు కూడా చెప్పొద్దు.. చాణ‌క్యుడు ఏం చెప్పారంటే 

Chanakya Niti: భారత చరిత్రలో గొప్ప తత్వవేత్తలలో ఒకరు ఆచార్య చాణక్యుడు. రాజకీయాలు, వ్యక్తిగత జీవితం, సామాజిక సంబంధాలు వంటి అనేక విషయాలపై ఆయన ఇచ్చిన సూచనలు ఇప్పటికీ మార్గ నిర్దేశం చేస్తుంటాయి. చాణక్య నీతి ప్రకారం భార్యకు కూడా చెప్పకూడని ఐదు ముఖ్యమైన విషయాలు ఏమిటో చూద్దాం.

వ్యక్తిగత బలహీనతలు బయటపెట్టకూడదు

ప్రతి మనిషిలోనూ కొన్ని బలహీనతలు ఉంటాయి. భయాలు, అసహాయ భావనలు, మానసిక అస్థిరతలు వంటి విషయాలు పూర్తిగా బయటపెట్టడం మంచిది కాదని చాణక్యుడు చెప్పాడు. ఇలాంటి విషయాలు కొన్నిసార్లు ఇతరులకు మనపై ఆధిపత్యం సాధించడానికి కారణమవుతాయి. దాంపత్యంలో ఎప్పుడైనా విభేదాలు వచ్చినప్పుడు మన బలహీనతలే మనకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. అందుకే వ్యక్తిగత లోపాలను పూర్తిగా బహిర్గతం చేయకుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించాడు.

ఆర్థిక విషయాల్లో పూర్తి వివరాలు చెప్పకూడదు

సంపాదన, దాచిన డబ్బు, పెట్టుబడుల వ్యూహాలు వంటి ఆర్థిక విషయాలను పూర్తిగా వెల్లడించకపోవడం మంచిదని చాణక్యుడు పేర్కొన్నాడు. డబ్బు వ్యవహారాల్లో కొంత గోప్యత ఉండడం అవసరం. అన్ని వివరాలు ముందుగానే చెప్పడం వల్ల అనుకోని పరిస్థితుల్లో సమస్యలు రావచ్చు. కాబట్టి ఆర్థిక వ్యవహారాలను తెలివిగా నిర్వహించుకోవడం మంచిదని ఆయన సూచించాడు.

గత అవమానాలను ఎక్కువగా చెప్పకూడదు

గతంలో ఎదురైన అవమానాలు, పరాభవాలు గురించి తరచుగా చెప్పడం మన గౌరవాన్ని మనమే తగ్గించుకున్నట్లే అవుతుందని చాణక్యుడు చెప్పాడు. ఇలాంటి విషయాలను పదే పదే ప్రస్తావించడం వల్ల మన వ్యక్తిత్వం బలహీనంగా కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే గతంలో జరిగిన అవమానాలను మరిచి ముందుకు సాగడం మంచిదని ఆయన తన బోధనల్లో వివరించాడు.

భవిష్యత్ ప్రణాళికలు ముందుగానే బయటపెట్టకూడదు

వ్యాపారం, ఉద్యోగం లేదా రాజకీయాల్లో విజయాన్ని సాధించాలంటే వ్యూహాలు చాలా ముఖ్యం. చాణక్యుడు చెప్పిన ముఖ్యమైన సూత్రం ఏమిటంటే కార్యం పూర్తయ్యే వరకు ర‌హ‌స్యంగా ఉంచాల‌న్నారు. మన ప్రణాళికలను ముందుగానే వెల్లడిస్తే అవి విఫలమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పనిని విజయవంతంగా పూర్తి చేసే వరకు ప్రణాళికలను రహస్యంగా ఉంచాలని ఆయన సూచించాడు.

దానం లేదా మంచి పనులను ప్రచారం చేయకూడదు

ఎవరికి సహాయం చేసినా, దానం చేసినా దాన్ని ప్రకటించడం మంచిది కాదని చాణక్యుడు చెబుతాడు. మంచి పనులను ప్రచారం చేయడం వల్ల వాటి విలువ తగ్గిపోతుందని ఆయన అభిప్రాయం. నిశ్శబ్దంగా చేసిన దానం ఎక్కువ పుణ్యాన్ని ఇస్తుందని చాణక్య నీతి చెబుతుంది. సహాయం చేయడం ఒక గొప్ప గుణం. కానీ దానిని గొప్పగా చెప్పుకోవడం అవసరం లేదని ఆయన స్పష్టం చేశాడు.

Mokshith

Mokshith

Next Story