Dakshinamurthy: పిల్లలు చదువులో వెనకబడితే... పెద్దలు చెప్పిన ఈ శ్లోకాన్ని నేర్పించండి..వారంలోనే మార్పు కనిపిస్తుంది
చదువులో వెనకబడిన పిల్లలకు రోజూ గురు దక్షిణామూర్తి శ్లోకాన్ని చదవడం నేర్పించండి. జాతకంలో గురుబలం పెరిగి చదువులో రాణిస్తారు.
Dakshinamurthy: పిల్లలు ఎవరైనా సరే చదువులో రాణించాలంటే ఖచ్చితంగా వారి జాతకంలో గురుబలం ఉండాలి. గురుబలంతో పాటు బుధగ్రహ అనుగ్రహం కూడా ఉంటే చదువులో ఉన్నతంగా రాణిస్తారు. అయితే, కొంతమంది పిల్లలకు ఆసక్తి ఉన్నా చదువులో వెనకబడిపోవడం లేదా, చదువు కంటే ఇతర విషయాల్లో ఎక్కువగా మునిగిపోయేవారిని తిరిగి విద్యపై దృష్టిమరలేలా చేయడానికి మన పూర్వీకులు కొన్ని పరిష్కారాలను చెప్పారు. వాటిని ప్రతిరోజూ తూచా తప్పకుండా అనుసరించేవారు తిరిగి గాడిలో పడతారు. ఉన్నతంగా కాకపోయినా కనీసం పరీక్షల్లో ఫెయిల్ కాకుండా విజయం సాధిస్తారని పెద్దలు చెబుతున్నారు. మరి ఆ పరిష్కారం ఏంటో తెలుసుకుందాం.
గురువుబలం కోసం దక్షిణామూర్తి శ్లోకం
శ్రీ దక్షిణామూర్తిని ఆదిగురువుగా చెబతాం. నిత్యం దక్షిణామూర్తిని ఆరాధించేవారికి జీవితంలో ఎటువంటి లోటు ఉండదు. అంతేకాదు, దక్షిణామూర్తి చిత్రపటాన్ని పూజగదిలో ఉంచుకొని నిత్యం దీపారాధన చేసేవారు అనుకున్న రంగంలో ఉన్నతస్థాయికి చేరుకుంటారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పెద్దలే కాదు...పిల్లలకు కూడా దక్షిణామూర్తి శ్లోకాన్ని నేర్పించాలి. దాని అర్ధాన్ని వివరించి చెప్పాలి. శ్లోకాన్ని అర్ధవంతంగా నేర్చుకున్న విద్యార్థులకు గురువు అనుగ్రహం కలుగుతుంది. జాతకంలో గురుబలం పెరుగుతుంది. ఎటువంటి ఆటంకాలు ఎదురైనా గురువు దాని నుంచి తప్పిస్తాడు.
నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్.... గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః || ఇది చాలా చిన్న శ్లోకం. చిన్నారులు చాలా సులభంగా నేర్చుకోవచ్చు. ఈ శ్లోకాన్ని పట్టువిడవకుండా...పట్టుదలతో రాగయుక్తంగా తప్పులు లేకుండా ఎవరైతే నేర్చుకుంటారో వారికి గురుబలం పెరుగుతుంది. అంతేకాదు, విద్యార్థులు ప్రతిరోజూ ఈ శ్లోకాన్ని పఠించడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏకాగ్రత కలుగుతుంది.
ఎంత సులభమైన శ్లోకం అయినా సరే దానికి తప్పనిసరిగా అర్ధం తెలుసుకోవాలి. అర్ధం తెలుసుకోకుండా పఠించడం వలన ఫలితం శూన్యం. దక్షిణామూర్తి శ్లోకానికి అర్ధం ఏమంటే...సమస్త విద్యలకు నిధి అయినటువంటివారు...సంసారమనే భవరోగాలను నయం చేసే వైద్యుడైనటువంటివారు... సమస్త లోకాలకు గురువైనటువంటివారైన శ్రీ దక్షిణామూర్తి స్వామికి నమస్కారములు. అర్ధం తెలుసుకుంటే శ్లోకం చదవడం చాలా సులభంగా ఉంది కదా.
బుధగ్రహం కోసం
బుద్ధిని ప్రసాదించేవాడు చంద్రడు. జీవితంలో చంద్రుడిని కూడా ప్రసన్నం చేసుకోవాలి. ప్రతిరోజూ సాయంత్రంవేళ ఆకాశంలోకి చూస్తూ చంద్రుడిని తలచుకొని స్వామి నేను చిన్నవాడిని నాకు పెద్దగా పాండిత్యం లేదు...నా జీవితం ఎదుగుదలకు బుద్ధి అవసరం చాలా ఉంది. దయతో నాయందు కరుణను చూపించు అని చేతులు జోడించి ఆ చంద్రుడికి నమస్కరిస్తే చాలు... ఆయనే బుద్ధిని ప్రసాదిస్తాడు. ఉదయాన్నే దక్షిణామూర్తి శ్లోకం, సాయంత్రం చంద్రుడికి నమస్కారం చేసుకుంటే వారం తిరక్కముందే పిల్లల ప్రవర్తనలో, చదువులో మార్పులు తప్పకుండా వస్తాయి.




