Darbha Asana Benefits: పూజ సమయంలో చేసే ఈ చిన్న పొరపాటు... మీ జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది

చేసిన పూజలు ఫలించాలంటే, సమస్త దోషాలను పొగొట్టి అద్భుతమైన ఫలితాలను అందించే దర్బాసనంపై కూర్చొని మాత్రమే పూజలు చేయాలి. నేలపై లేదా నిలబడి ఎట్టిపరిస్థితుల్లో ఇంట్లో పూజలు చేయకూడదు.

Balachander
Published on: 30 May 2026 9:50 AM IST
Darbha Asana Benefits: పూజ సమయంలో చేసే ఈ చిన్న పొరపాటు... మీ జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది
X

Darbha Asana Benefits: మనం సాధారణంగా ఇంట్లో పూజలు చేసినా... ఫలితం రావట్లేదని తెగ బాధపడిపోతుంటాం. దీనికి ప్రధానమైన కారణం ఒకటి ఉంది. పూజ సమయంలో మనం చేసే చిన్న పొరపాటే. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, దేవుని పూజను నిలబడి చేయకూడదు. అలాగే భూమికి ఆనేలా కూర్చొని కూడా చేయకూడదు. నేలపై కూర్చొని చేయడం వలన మనలోని ఆధ్యాత్మిక శక్తిని, పూజా ఫలాన్ని కూడా భూమి ఆకర్షణ శక్తి లాగేసుకుంటుంది. అందుకే పూజ చేసే సమయంలో ఖచ్చితంగా ఆసనాన్ని ఉపయోగించాలి. ఈ ఆసనాల్లో కూడా సమస్త దోషాలను తొలగించే శక్తివంతమైన దర్బాసనాన్ని వినియోగించాలని పండితులు చెబుతున్నారు.

శ్రీమహావిష్ణువు శరీర కేశమే ఈ దర్భ!

దర్భ దీనినే కుశగడ్డి అని కూడా పిలుస్తాం. ఇది కేవలం ఒక గడ్డి జాతి కాదు. పురాణాల ప్రకారం, శ్రీమహావిష్ణువు వరాహ అవతారంలో ఉన్నప్పుడు ఆయన శరీరం నుండి రాలిన కేశాలే భూమిపై దర్భలుగా ఉద్భవించాయి. అందుకే దీనికి అంతటి పవిత్రత చేకూరింది. వాల్మీకి రామాయణంలో సైతం శ్రీరామచంద్రుడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు వ్రత నియమాల కోసం దర్భాసనం పైనే శయనించాడని చెబుతారు.

దర్భాసనం ఎందుకు వాడాలి?

పూజా సమయంలో దర్భలతో చేసిన చాప లేదా పీటపై కూర్చోవడం వెనుక ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో కేతువు మోక్షకారకుడు. జ్ఞానకారకుడు. కేతు గ్రహానికి అధిదేవత బ్రహ్మదేవుడు. కేతువు అనుగ్రహం కోసం సూచించిన ఏకైక సమిధ దర్భ మాత్రమే. ఈ ఆసనంపై కూర్చొని జపం, ధ్యానం లేదా పూజ చేయడం వలన కేతు గ్రహదోషాలు తొలగిపోతాయి. బుద్ధి, మంత్రసిద్ధి లభిస్తాయి. అంతేకాదు, ఈ దర్భకు పర్యావరణంలో హానికరమైన కిరణాలను, విషాన్ని తొలగించే శక్తి ఉంటుంది. గ్రహణ సమయాల్లో దర్భ ముక్కలను ఇంట్లోని వంటగది వస్తువులపై ఉంచాలన్నది ఆచారం. దర్భలు పూజ చేసే సాధకుడి చుట్టూ ఓ రక్షణ కవచాన్ని ఏర్పరుస్తాయి.

ఒకవేళ దర్భాసనం అందుబాటులో లేకపోతే?

అన్ని వేళలా దర్భలతో అల్లిన చాపలు లేదా ఆసనాలు దొరకకపోవచ్చు. అలాంటప్పుడు నిరాశపడాల్సిన పనిలేదు. శాస్త్రం దీనికి ఒక సులువైన మార్గాన్ని చెప్పింది. దర్బచాపలు లేదా ఆసనాలు అందుబాటులో లేకుంటే ఓ చిన్న దర్భ ముక్కను నేలపై ఉంచి దానిపై వస్త్రాన్ని పరుచుకొని కూడా పూజ చేయవచ్చు. దర్భాసనంపై కూర్చొని పూజ చేయడం వలన కలిగే ఫలితాలు ఇలా చేయడం వలన కూడా దక్కుతాయని పండితులు చెబుతున్నారు. మనం పూజలో వాడే పాత్రలు, పువ్వులతో పాటు కూర్చొనే ఆసనం కూడా మన ఆధ్యాత్మిక భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story