Dreaming of Rain: కలలో ఇలా వర్షం కురిస్తే...మీ ఇంట లక్ష్మీకటాక్షమే

కలలో వర్షం కురుస్తున్నట్లు కనిపిస్తే దాని అర్థం ఏమిటి? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వర్షం కలలు ధనలాభం, శుభవార్తలు, లక్ష్మీదేవి అనుగ్రహం, ఉద్యోగ పురోగతి, కుటుంబ శ్రేయస్సుకు సంకేతాలుగా ఎందుకు భావిస్తారు.

Balachander
Published on: 16 Jun 2026 10:34 AM IST
Dreaming of Rain: కలలో ఇలా వర్షం కురిస్తే...మీ ఇంట లక్ష్మీకటాక్షమే
X

Dreaming of Rain: స్వప్న శాస్త్రం ప్రకారం కలలో వర్షం కురవడం అనేది కేవలం ఒక ప్రకృతి దృశ్యం కాదు. అది మీ ఇంట్లోకి సాక్షాత్తు ఆ మహాలక్ష్మీ దేవి నడిచి రాబోతుందనడానికి పవిత్రమైన సంకేతం. సాధారణంగా రాత్రి వేళల్లో మనకు వచ్చే కలలు భవిష్యత్తులో జరగబోయే మంచి చెడులను ముందుగానే సూచిస్తాయి. కల మనకు భయాన్ని కలిగిస్తే కీడు జరుగుతుందని, అదే మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తే శుభం జరుగుతుందని పెద్దలు చెబుతారు. ఈ క్రమంలో కలలో వర్షం కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో, లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా లభిస్తుందో ఈ కథనంలో స్పష్టంగా తెలుసుకుందాం.

కలలో వర్షం... అదృష్టాన్ని తెచ్చే సంకేతాలు

జ్యోతిష్య నిపుణులు, స్వప్న శాస్త్ర పండితుల ప్రకారం, కలలో నీరు లేదా వర్షం కనిపించడం అనేది అపారమైన ధనలాభానికి సూచికగా చెబుతారు. ఇందులో ప్రధానంగా మూడు రకాల స్వప్న ఫలాలు దాగి ఉన్నాయి. గత కొంతకాలంగా అప్పుల బాధలతో సతమతమవుతుంటే...కలలో మీకు వర్షం పడుతున్నట్టుగా కనిపిస్తే...రాబోయే ఆరు నెలల కాలంలో మీరు అప్పులను తీర్చేసి రుణ విముక్తులవుతారు అని చెప్పడానికి సంకేతం. ఊహించని మార్గాల ద్వారా మీకు లక్ష్మీకటాక్షం సిద్దిస్తుంది. వర్షంలో తడుస్తున్నట్టుగా కల వస్తే ఉద్యోగం లేదా వ్యాపారంలో తిరుగులేని విజయాలు అందుకోబోతున్నారని అర్ధం. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం, వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, కలలో ఒక్కసారిగా తుఫానులా కాకుండా అవసరం మేరకు సమృద్ధిగా భారీ వర్షం కురుస్తున్నట్లుగా కనిపిస్తే ఇంట్లో శుభకార్యాలు జరగబోతున్నాయని, దీర్ఘకాలిక కోరికలు నెరవేరబోతున్నాయని సంకేతం.

లక్ష్మీదేవి రాకను సూచించే ఆధ్యాత్మిక రహస్యం

ప్రకృతిలో వర్షం కురిస్తే భూమి ఎలా పచ్చదనంతో, ధాన్యంతో కళకళలాడుతుందో... అలాగే మీ కలలో వర్షం కురిస్తే మీ ఇల్లు కూడా ధనధాన్యాలతో, సుఖసంతోషాలతో నిండిపోతుంది. ఇది మీ పూర్వజన్మ సుకృతం వల్ల మాత్రమే వచ్చే దైవిక కలగా పెద్దలు చెబుతారు. ఇలాంటి కల వచ్చినప్పుడు ఉదయాన్నే లేచి ఇష్టదైవాన్ని స్మరించుకుని, వీలైతే ఒక ముత్తైదువుకు పసుపు, కుంకుమ ఇవ్వడం వల్ల ఆ కలలోని సానుకూల శక్తి మరింత పెరుగుతుంది. కాబట్టి, కలలో వర్షం వస్తే కంగారు పడకండి... ఆనందపడండి, ఎందుకంటే మీ ఇంట లక్ష్మీదేవి అడుగుపెట్టబోతోంది!

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story