Green Toran at Home: ఇంటి గుమ్మానికి పచ్చతోరణం... ఇలా వదిలేస్తే అశుభం...

ఇంటి గుమ్మం ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలి. ఆకులు ఎండిపోకుండానే తీసేసి కొత్తవాటిని కట్టాలి. దీనికి కొన్ని తిథులు, వారాలు మంచివి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Balachander
Published on: 18 Jun 2026 10:44 AM IST
Green Toran at Home: ఇంటి గుమ్మానికి పచ్చతోరణం... ఇలా వదిలేస్తే అశుభం...
X

Green Toran at Home: ఇంటి గుమ్మం ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. గుమ్మం పచ్చగా ఉంటే ఇల్లు కళకళలాడుతుంది. లక్ష్మీదేవి ఇంట్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుంది. అయితే, కొంతమంది పండుగల సమయంలో ఇంటికి మామిడి తోరణాలు లేదా పండుగ సందర్భాన్ని బట్టి వేప, ఆశోకచెట్టు ఆకులను గుమ్మానికి కడుతుంటాం. ఇలా కట్టిన ఆకులను తిరిగి మరో పండుగ వచ్చే వరకూ అలానే వదిలేస్తుంటారు. ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఇలానే వదిలేయడం వలన ఇంటికి అశుభం జరుగుతుందని, పనులు వాయిదా పడటం లేదా ఏదో విధమైన అడ్డంకులు రావడం జరుగుతుందని చెబుతున్నారు.

తోరణం ఎప్పుడు తీసివేయాలి

వాస్తు శాస్త్రం ప్రకారం తోరణం కట్టడం వలన ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. పవిత్రతను తీసుకొస్తుంది. అంతేకాదు, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని కూడా తీసుకొస్తుంది. పచ్చగా ఉన్న ఇల్లు నిత్య కళ్యాణంగా మారుతుంది. కానీ, ఈ ఆకులు ఎండిపోయి...పగిలిపోయే వరకు అలాగే ఉంచితే అదే మీ ఇంటికి అశుభం కూడా. ఒకదాని తరువాత ఒకటిగా సమస్యలు క్యూకడతాయి. తెలియని అడ్డంకులు, చీకాకులు, పనులు ముందుకు సాగకపోవడం వంటివి కలుగుతుంటాయి. ఎండిపోయిన ఆకులను తొలగించడానికి కొన్ని ప్రత్యేకమైన రోజులు, తిథులు ఉన్నాయి. అందులో ప్రధానంగా మంగళవారం, గురువారం, శనివారం, ఏకాదశి, పౌర్ణమి వంటి రోజుల్లో ఇంటికి కట్టిన తోరణాలను మార్చాలి. పాతవాటిని చెత్తబుట్టలో వేయకుండా వాటిని ప్రవహించే నీటిలో లేదా గొయ్యి తీసి భూమిలో పాతిపెట్టాలి. గుర్తుంచుకోండి ఎట్టిపరిస్థితుల్లో కూడా చెత్తబుట్టలో వేయకూడదు. తోరణాలను ప్రతి పది నుంచి 15 రోజుల మధ్యలో మార్చుతూ ఉండాలి. ఇలా చేయడం వలన ఇంట్లో సానుకూల శక్తుల ప్రవాహం స్థిరంగా ఉంటుంది. లక్ష్మీకటాక్షం లభిస్తుంది. ఎండిన ఆకులు స్థబ్ధతకు, ప్రతికూలతలకు, బలహీనతలకు ప్రతీకగా చెబుతారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story