Hanuman Miracle Village: ఆంజనేయుడి మహిమ... పాము కరిచిన 48 గంటల్లోగా...

పాములను చూస్తే మనం ఆమడదూరం పరిగెడతాం. లేదా కర్ర తీసుకొచ్చి కొట్టి చంపేస్తాం. కానీ, కర్ణాటకలోని నాగేనహళ్లి అనే గ్రామంలోని ప్రజలు వందలాది పాములతో సహవాసం చేస్తారు.

Balachander
Published on: 12 May 2026 9:00 AM IST
Hanuman Miracle Village: ఆంజనేయుడి మహిమ... పాము కరిచిన 48 గంటల్లోగా...
X

Hanuman Miracle Village: పాములను చూస్తే మనం ఆమడదూరం పరిగెడతాం. లేదా కర్ర తీసుకొచ్చి కొట్టి చంపేస్తాం. కానీ, కర్ణాటకలోని నాగేనహళ్లి అనే గ్రామంలోని ప్రజలు వందలాది పాములతో సహవాసం చేస్తారు. సాధారణ జంతువుల మాదిరిగా పాములు తిరుగుతుంటాయి. కానీ, ఎవరినీ ఏమీ చేయవట. ఇన్ని పాములు తిరిగే చోట పాము కాటుకు విరుగుడు మందులు ఉంటాయని అనుకుంటాం. ఈ గ్రామంలో అలాంటివేమి ఉండవు. హనుమంతుని ఆలయంలో తీర్థం తీసుకొని 48 గంటల పాటు నిష్టగా ఉంటే చాలు... ప్రాణాంతకమైన విషం కూడా నీరుగా మారిపోతుంది. సైన్స్‌కి అందని ఈ ఆధ్యాత్మిక రహస్యం వెనుక ఓ సాధువు తపఃశ్శక్తి దాగుంది.

పాములతో సహజీవనం - ఇక్కడ అంతా వింతే!

సాధారణంగా పాము కనిపిస్తే ఆమడ దూరం పరుగెడతాం. కానీ నాగేనహళ్లి గ్రామంలో పరిస్థితి వేరు. ఈ గ్రామంలో సుమారు 100 ఇళ్లు ఉన్నాయి. ప్రతీ ఇంట్లో మనకు పదుల సంఖ్యలో పాములు దర్శనమిస్తాయి. కుటుంబంలోని సభ్యుల్లాగా అవి తిరుగుతుంటాయి. ఈ గ్రామంలో ఎవరూ పాములను చంపరు. వింతేమిటంటే, ఇక్కడి పాములు స్థానికులను కానీ, కొత్తవారిని కానీ ఏమీ చేయవు. పొరపాటున ఎవరినైనా కాటేసినా, ఆ విషం శరీరంపై ప్రభావం చూపదు. అయితే దీనికి ఒకే ఒక షరతు ఉంది.. కాటుకు గురైన వ్యక్తి 48 గంటల పాటు గ్రామ పొలిమేర దాటకూడదు.

హనుమాన్ తీర్థం - 48 గంటల జాగరణ

పాము కరిచిన వ్యక్తిని వెంటనే గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకెళ్తారు. అక్కడ స్వామివారి పవిత్ర తీర్థాన్ని ఇచ్చి, మరుసటి రోజు వరకు నిద్రపోకుండా 'జాగరణ' చేయిస్తారు. ఈ సమయంలో ఆ వ్యక్తి గ్రామ సరిహద్దులు దాటితే ప్రాణాపాయం తప్పదు. 48 గంటల తర్వాత విషం పూర్తిగా విరిగిపోయి, మనిషి క్షేమంగా బయటపడతాడు. ఆధునిక వైద్య శాస్త్రానికి ఇది ఒక పెద్ద సవాలుగా నిలుస్తోంది. ఆంజనేయుని తీర్థం తీసుకుంటే చాలు... ప్రాణాలకు ఏం కాదని అంటారు స్థానిక ప్రజలు. వినడానికి వింతగా ఉన్నా... బయటనుంచి చూసేవారికి భయమే. పొలిమేర దాటకుండా, జాగరణ చేస్తు ఆలయంలో ఉండాలి అంటే దానికి ఎంతో శ్రద్ధ, భగవంతుని పట్ల భక్తి అవసరం. ఒకవేళ ఎవరైనా ఇలా మరణించారంటే...వారిలో నిష్టలేదని అర్థం.

యతీశ్వర స్వామి శాపం.. వరం!

ఈ వింతైన కథ వెనుక ఓ చారిత్ర నేపథ్యం ఉంది. పూర్వం ఈ గ్రామంలో యతీశ్వర అనే సాధువు ఉండేవాడు. ఆయనకు హనుమంతుడు అంటే అమితమైన భక్తి. పొదల్లో దొరికిన బిడ్డను తన బిడ్డగా భావించి పెంచుకున్నాడు. 12 ఏళ్ల వయసులో బాలుడు పాము కాటుకు గురై మరణిస్తాడు. దీంతో ఆగ్రహించిన యతీశ్వరుడు సర్పజాతిని శపించబోగ... నాగరాజు ప్రత్యక్షమై క్షమించమని వేడుకుంటాడు. బాలుడిని పునర్జీవింపజేస్తాడు. ఆ సమయంలో యతీశ్వరుడు ఓ నియమం విధిస్తాడు. హనుమంతుడి రక్షణలో ఉన్న ఈ గ్రామంలో ఏ పాము విషం కూడా మనిషిని చంపకూడదని షరతు విధిస్తాడు. ఆ షరతుకు నాగరాజు అంగీకరించినట్టుగా చెబుతారు. అప్పటి నుంచే గ్రామంలో ఎవరినీ పాములు కరవలేదు. ఒకవేళ కరిచినా 48 గంటల్లోగా ఆ విషం నీరుగారిపోతుంది.

గ్రామ నిబంధనలు

యతీశ్వర స్వామి నాగేన హళ్లి గ్రామంలో కొన్ని కఠినమైన నియమాలను ప్రతిపాదించారు. గ్రామంలో ఎవరూ మద్యం, మాంసాహారం ముట్టుకోకూడదు. గ్రామంలో తిరిగే పాములను ఎవరూ చంపకూడదు. ఇలా మద్యం, మాంసం భుజించినా... పాములను చంపినా నేరంగా భావిస్తారు. వారికి గ్రామం కఠిన శిక్షలు విధిస్తుంది. గ్రామంలో నాలుగు దిక్కుల్లో నాలుగు సరిహద్దు రాళ్లను ఉంచారు. ఈ సరిహద్దు లోపల ఉన్నంత వరకు హనుమంతుని రక్షణ ఉంటుంది. పాము విషం ఈ సరిహద్దు లోపల పనిచేయదు. ఒక్కమాటలో చెప్పాలంటే నమ్మకం ఉన్నచోట విజ్ఞానం తలవంచక తప్పదు. దీనికి ఓ ఉదాహరణ నాగేనహళ్లి గ్రామం. ఇక్కడి ప్రజలు సాధువు మాటను, హనుమంతుడి శక్తిని నమ్ముతూ పాములతో కలిసి ప్రశాంతంగా జీవిస్తున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story