Hanuman: హనుమంతుడి శక్తి అంతా ఈ మంత్రంలోనే... 21 రోజులు ఇలా చేస్తే చాలు... ఏం కావాలన్నా ఇచ్చేస్తాడు
హనుమంతుడి అనుగ్రహం పొందేందుకు శక్తివంతమైన హనుమత్ సూక్తం ఎలా జపించాలి? 11, 21, 108 సంఖ్యల ప్రాముఖ్యత ఏమిటి? 21 రోజుల పారాయణంతో కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
Hanuman: ఎంత కష్టపడినా విజయం దక్కడం లేదా ?హనుమంతుడు లంకను దాటినంత సులువుగా లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలి. హనుమంతుడి శక్తిని నిక్షిప్తం చేసిన మంత్రం ఏమిటి... ఎలా జపించాలి... తెలుసుకుందాం.
మానవ జీవితంలో శ్రమ ఎంత ముఖ్యమో, దైవానుగ్రహం కూడా అంతే ముఖ్యం. ఎంత కష్టపడి పనిచేసినా వేసే ప్రతి అడుగులో విజయం సాధించాలంటే ఆంజనేయస్వామి పరిపూర్ణ కృపాకటాక్షాలు ఉండాల్సిందే. సముద్ర లంఘనం చేసి లంకలో అడుగుపెట్టినట్లుగా, మనలోని ప్రతికూలతలను తొలగించి విజయం వైపు నడిపించే ఏకైక శక్తి ఆంజనేయుడు. హనుమంతుని ప్రసన్నం చేసుకోవడానికి, కోరిన కోరికలు నెరవేర్చుకోవడానికి సనాతన గ్రంథాలలో హనుమత్ సూక్తం అత్యంత శక్తివంతమైన సాధనగా పేర్కొనబడింది.
హనుమత్ సూక్తం ఎలా పఠించాలి?
ఈ ప్రాచీన దివ్య సూక్తాన్ని హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ స్తోత్రాలతో కలిపి పఠించడం ఎంతో శుభప్రదం. పఠన విధానంలో పండితులు సూచించిన కొన్ని ముఖ్యమైన సంఖ్యలు, నియమాలు ఏమిటో చూద్దాం. హనుమంతునికి 11 అనే సంఖ్య అత్యంత ప్రియమైనది. అందువల్ల ప్రతిరోజూ ఉదయాన్నే 11 సార్లు ఈ సూక్తాన్ని జపిస్తే శుభ ఫలితాలు లభిస్తాయి. అంతేకాదు, తులసి జపమాలతో రోజుకు 108 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే మనోభీష్టం నెరవేరుతుంది. ఇక, ప్రతిరోజూ త్రికాలాల్లో అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో నిత్యపారాయణగా 21 రోజుల పాటు నియమంతో చేస్తే జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోయి అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.
దివ్య హనుమత్ సూక్తం
"శ్రీ మాన్ సర్వలక్షణ సంపన్నో జయప్రదః
సర్వాభరణ భూషిత ఉదారోమహూెన్నత ఉష్ట్రారాఢః
కేసరిప్రియనందనో వాయుతనూజో
యధేచ్ఛం పంపాతీరవిహారీ గంధమాదనసంచారీ
హేమప్రాకారాంచిత కనక కదళీవనాంతర నివాసీ
పరమత్మా మకరీ శాపవిమోచనో హేమవర్ణో నానారత్న ఖచితామమూల్యతరాం
మేఖలాంచ స్వర్ణోపవీతం కౌశేయవస్త్రం చ బిభ్రణః
సనాతనో మహాబలప్రమేయ ప్రతాపశాలీ రజతవర్ణః
శుద్ధస్ఫటికసంకాశః పంచవదనః పంచదశనేత్ర స్సకలదివ్యాస్త్రధారీ
శ్రీ సువర్చలారమణో మహేంద్రాద్యష్ట దిక్పాలక త్రయస్త్రిం
శద్గీర్వాణ ముని గణ గంధర్వ యక్షకిన్నెర పన్నాగాసుర పూజిత
పాదపద్మయుగళో నానావర్ణః కామరూపః కామచారీ యోగిధ్యేయం శ్రీ హనుమాన్ ఆంజనేయః
విరాడ్రూపీ విశ్వాత్మా పవననందనః పార్వతీపుత్రః ఈశ్వరతనూజః సకల మనోరధాన్నోదదాతు." ఇది హనుమత్ దివ్య సూక్తం. మొదట్లో దీనిని చదవడానికి కొంచెం కష్టంగా అనిపించినా నిత్యం పఠించడం వలన వాక్‌శుద్ధి కలుగుతుంది. పఠన విధానం అలవరుతుంది.
పారాయణ వల్ల లభించే ఆధ్యాత్మిక ప్రయోజనాలు
ఈ సూక్తాన్ని నిత్యం స్పష్టంగా చదవడం వల్ల స్వర దోషాలు, ఉచ్చారణా లోపాలు తొలగిపోయి వాక్శుద్ధి కలుగుతుంది. అంతేకాదు, అక్షర దోషాలు లేకుండా శ్రద్ధగా చదువుతుంటే మనస్సు సహజంగానే రామభక్తుడైన హనుమంతుని దివ్య చరణాల వైపు మళ్లుతుంది. ఇక, భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మంగళవారం ప్రదోషకాలంలో ఈ మంత్రం పఠనం చేయడం ప్రారంభించి 21 రోజులపాటు విధిగా ఆచరించండి. జీవితంలో తప్పకుండా మార్పులు కనిపిస్తాయి.




