Hidden Treasure Secrets: భూగర్భ నిధుల గురించి పూర్వీకులు చెప్పిన రహస్యాలు...పాముల కాపలా నిజమేనా?

నిధులకు పాములు, క్రిములు, పిశాచాలు కాపలాగా ఉంటాయా? పూర్వీకులు చెప్పిన రహస్యాలు వింటే గుండెలు అదిరిపోతాయి.

Balachander
Published on: 20 Jun 2026 10:17 AM IST
Hidden Treasure Secrets: భూగర్భ నిధుల గురించి పూర్వీకులు చెప్పిన రహస్యాలు...పాముల కాపలా నిజమేనా?
X

Hidden Treasure Secrets: ఇటీవల కాలంలో నిధుల వేట ఎక్కువగా జరుగుతున్నది. పూర్వ కాలంలో రాజులు, ధనికులు తమ వద్ద ఉన్న ధనాన్ని, బంగారాన్ని భూగర్భంలో రహస్యంగా దాచేవారు. ఇలా దాచిన బంగారం ఎవరికంట పడకుండా ఉండేందుకు నాగబంధనం, గరుడబంధనం, పిశాచబంధనం, నీటిబంధనం, గాలిబంధనం వంటి వివిధ రకాలైన బంధనాలు వేసేవారు. పూర్వం రోజుల్లో ఇలాంటి బంధనాలు సర్వసాధారణం. అయితే, బంధనాలు వేసిన సమయంలో వాటిని సంబంధించిన శక్తులను ఆవాహనం చేసుకునేవారు. ఇలా ఆవాహనం చేసిన శక్తులు ఆ నిధులకు రక్షణగా ఉంటాయి. సైన్స్‌ వీటిని కాదని కొట్టేస్తున్నా...పూర్వీకులు చెప్పిన ప్రకారం ఇది ముమ్మాటికీ నిజం. నేటికీ మనకు ఆ శక్తులు కనిపిస్తూనే ఉంటాయి. అయితే, వీటిని గుర్తించడం చాలా కష్టం.

నిధులకు కాపలా

ఈరోజుల్లో మన వద్ద ఉన్న డబ్బును, బంగారాన్ని సేఫ్‌గా బ్యాంకుల్లో భద్రపరుచుకుంటున్నాం. కానీ, పూర్వం అలా కాదు. ప్రత్యేకించి బ్యాంకులు లాకర్లు వంటివి లేవు. ఎవరి ధనం వారి వద్దనే, బంగారం కూడా వారి వద్దనే ఉండేది. ఆరోజుల్లో దొంగల భయంతో పాటు, రాజ్యాల మధ్య పోరు కారణంగా దండయాత్రలు జరుగుతుండేవి. వీటి నుంచి రక్షణ కోసం నిధినిక్షేపాలను భూమిలో దాచిపెట్టేవారు. దీనికోసం నిష్ణాణుతులైన మంత్రవేత్తల సహాయంతో నిధికి రక్షణగా కొన్ని శక్తులను ఉంచేవారు. దీనికి మనం ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలోనే ఓ ప్రాంతంలో రైల్వేలైను వేసేందుకు అధికారులు భూమిని తవ్వుతుండగా పాములు బయటపడ్డాయి. ఎన్ని పాములను చంపినా ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయి. నిపుణులైన పండితులను సంప్రదించగా...ఆ ప్రాంతంలో నాగబంధనం ఉందని, లైను మార్చాలని చెప్పగా.. దానికి కొంత దూరం నుంచి లైను వేశారు. ఇలాంటివి దేశంలో చాలానే ఉన్నాయి.

భూగర్భనిధులను తవ్వి తీయగలమా?

దీనికి సమాధానం చాలా లోతుగా ఇవ్వవలసి ఉంటుంది. నిధి నిక్షేపాలను తవ్వి తీయడం అంత సులభం కాదు. మైనింగ్‌ చేసి బంగారాన్ని తవ్వినట్టుగా వీటిని తీయలేం. ఎందుకంటే ఆవాహనం చేసిన శక్తులు ఎలా ఉంటాయో ఈ కాలంలో ఎవరికీ తెలియదు. వీటి గురించి తెలిసినవాళ్లు లేరు. నాగబంధనం ఉంటే దానికి విరుగుడుగా గరుడమంత్రం ప్రయోగించాలి. నాగబంధనం వేసే సమయంలో అష్టదిక్కుల్లో ఎనిమిది రకాలైన సర్పాలను ఆవాహనం చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆవాహనం ఉంటుంది. ఏ దిక్కుల్లో ఎలాంటి కాలకూట సర్పాన్ని ఆవాహనం చేస్తారో తెలియదు. ఆ దిక్కుల్లో ఉన్న వాటికి సరైన విరుగుడు ప్రయోగించకుంటే మొదటికే మోసం వస్తుందని పూర్వీకులు చెబుతున్నారు. కాబట్టి ఎవరైనా సరే ఇంటికోసమో, లేదా ఏదైనా పనికోసమో భూమిని తవ్వే సమయంలో విపరీతంలో పాములు, పురుగులు, వాసనతో కూడిన నీరు, భూమిని తవ్వుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ఎప్పుడూ చూడని విధంగా గాలి వస్తుంటే ఆ ప్రాంతాన్ని వదిలేయడం మంచిది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story