Jyeshtha Purnima 2026: జ్యేష్ఠ పౌర్ణమి తేదీలపై సందేహాలు...ఉపవాసం ఎప్పుడు చేయాలి...పూజా విధానం ఇదే

నిజ జ్యేష్ఠమాసంలో పౌర్ణమి తిథిపై పలు సందేహాలున్నాయి. పౌర్ణమి తిథి ప్రారంభం జూన్‌ 29వ తేదీ తెల్లవారుజామున ప్రారంభమై జూన్‌ 30వ తేదీ ఉదయం 5.26 గంటలకు ముగుస్తుంది.

Balachander
Published on: 18 Jun 2026 8:49 AM IST
Jyeshtha Purnima 2026: జ్యేష్ఠ పౌర్ణమి తేదీలపై సందేహాలు...ఉపవాసం ఎప్పుడు చేయాలి...పూజా విధానం ఇదే
X

Jyeshtha Purnima 2026: నిజ జ్యేష్ఠమాసంలో వచ్చే పూర్ణిమ తిథి అత్యంత విశిష్టమైనదిగా పండితులు చెబుతున్నారు. అయితే, ఈ ఏడాది జ్యేష్ఠ పూర్ణిమ జూన్‌ 29వ తేదీ తెల్లవారు జామున 3.06 గంటలకు ప్రారంభమై జూన్‌ 30వ తేదీ ఉదయం 5.26 గంటలకు ముగుస్తుంది. అయితే, మనం చంద్రమానాన్ని అనుసరిస్తాం కాబట్టి రాత్రి సమయంలో వచ్చే తిథిని పరిగిణలోకి తీసుకుంటాం. ఈ నేపథ్యంలో పూర్ణిమ తిథికి సంబంధించిన వ్రతాన్ని జూన్‌ 30న పాటిస్తారు. ఈ పూజకు సంబంధించిన శుభ సమయం జూన్‌ 30వ తేదీ ఉదయం 8.55 గంటల నుంచి ఉదయం 10.40 వరకు ఉంటుంది. ఉపవాసాన్ని కూడా జూన్‌ 30వ తేదీనే ఉండాలని పండితులు చెబుతున్నారు.

పౌర్ణమి వ్రతం...ఉపవాసం

ఇక జూన్‌ 30వ తేదీన పౌర్ణమి వ్రతాన్ని వివాహిత స్త్రీలు ఆచరిస్తారు. దీనినే వట సావిత్రి వ్రతం అని కూడా పిలుస్తారు. వట సావిత్రి వ్రతం అంటే రావి చెట్టును పూజించడం అని అర్ధం. తమ భర్తలకు శాశ్వత ఆనందంతో పాటు ఆయురారోగ్యాలు కలగాలని, కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొనాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం చేసే మహిళలు జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఆధ్యాత్మిక స్నానం చేస్తారు. అంటే పవిత్రమైన పుణ్యనదుల్లో గంగా లేదా ఇతర నదుల్లో స్నానం చేసి పితృదేవతలను ప్రార్థిస్తారు. ఇక్కడ మహిళలే కాదు పురుషులు కూడా పవిత్ర స్నానాలు చేసి పితృదేవతలను స్మరించుకుంటే వారికి మోక్షం లభిస్తుంది. ఆత్మ శాంతిస్తుంది. జ్యేష్ఠ పౌర్ణమి రోజున వ్రతం ఆచరించే మహిళలు తప్పకుండా ఉపవాసం ఉండాలని పండితులు చెబుతున్నారు.

వ్రత ఫలితం ఎలా ఉంటుందంటే

ఇక ఈ వ్రతం ఆచరించడం వలన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అయితే, ఈరోజున లక్ష్మీదేవికి 11 పసుపు రంగులో ఉండే గవ్వలను సమర్పించాలి. పసుపు గవ్వలు అందరికీ అందుబాటులో ఉండకపోతే శాస్త్రంలో దానికి ఓ పరిహారం ఉంది. స్వచ్చమైన పసుపును తెలుపు రంగు గవ్వలపై అద్ది అమ్మవారికి సమర్పించాలి. ఇలా చేయడం వలన అమ్మవారు మీ ఇంట నిలిచేందుకు ప్రయత్నిస్తారు. ఇక ఈరోజున వట వృక్షానికి నానబెట్టిన మినపప్పు, గోధుమలు, అరటిపండ్లు, కొన్ని రకాలైన పండ్లను ఎరుపురంగు వస్త్రంలో చుట్టి సమర్పించాలి. ఇక సాయంత్రం వేళ నదిలో లేదా సరస్సులో దీపాలను దానం ఇవ్వాలి. ఒకవేళ నదుల్లో సరస్సుల్లో దీపదానం కుదరని పక్షంలో కనీసం రాధాకృష్ణ ఆలయంలో అయినా దీపాలను దానం ఇవ్వండి. ఇలా చేయడం వలన జీవితంలో ఎదురైన చీకటి కోణాలు తొలగిపోయి ఆనందమనే వెలుగు ప్రసరిస్తుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story