Karungali Mala Benefits: అనంతమైన శక్తినిచ్చే కరుంగలి మాల... పూర్వికులు చెప్పిన విధంగా ధరిస్తే మేలు

నరదిష్టి, దుష్టశక్తుల నుంచి రక్షణ పొందడానికి కరుంగలి మాలను ధరిస్తారు. అయితే, ఈ మాల శక్తివంతం కావాలంటే కొన్ని నియమాలు పాటించాలి. అవేంటో తెలుసుకుందాం.

Balachander
Published on: 30 Jun 2026 7:42 AM IST
Karungali Mala Benefits: అనంతమైన శక్తినిచ్చే కరుంగలి మాల... పూర్వికులు చెప్పిన విధంగా ధరిస్తే మేలు
X

Karungali Mala Benefits: మన పూర్వీకులు సనాతన ధర్మంలో ప్రతి సమస్యకూ ఒక చక్కని పరిష్కారాన్ని చూపించారు. మానవ జాతకంలో 'ఆరవ స్థానం' అనేది పూర్వజన్మ కర్మలను, మనం మోసుకొచ్చిన రుణాలను సూచిస్తుంది. ఈ కర్మల వల్లే జీవితంలో అనేక ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, కోర్టు గొడవలు ఎదురవుతుంటాయి. ఈ చెడు కర్మల తీవ్రతను తగ్గించి, జీవితంలో అనంతమైన విజయాన్ని, సానుకూల శక్తిని ప్రసాదించే ఒక అద్భుత దైవిక సాధనమే "కరుంగలి మాల". అయితే, దీనిని ధరించేటప్పుడు కచ్చితమైన నియమాలు పాటించకపోతే ఆశించిన ఫలితం దక్కదు సదా దోషం చుట్టుకుంటుంది. కరుంగలి మాల అనేది కేవలం ఒక అలంకార వస్తువు కాదు. అది మనిషి చుట్టూ ఉండే 'ఆరా' అనబడే దివ్యకాంతి వలయాన్ని రక్షించే ఒక కవచం. దీనిని ధరించాలనుకునే భక్తులు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు, రోజులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

తిథులు, వారాల నియమం

ఈ పవిత్రమైన మాలను ఏ రోజు పడితే ఆ రోజు ధరించకూడదు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన రోజుల్లోనే దీనిని మెడలో వేసుకోవాలి. ఈ కరుంగలి మాల ధరించడానికి బుధ, గురు, శనివారాలు ఉత్తమమైనవి. పంచమి, ఏకాదశి, త్రయోదశి లేదా పౌర్ణమి ఘడియల్లో ఈ మాలను ధరించడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి.

మంత్ర జపం...

మాలను ధరించిన తర్వాత దానికి మంత్ర శక్తి తోడవాలి. మాలను ధరించేవారు సుబ్రహ్మణ్యేశ్వరుని అనుగ్రహం కోసం ఒక నియమాన్ని పాటించాలి. మాల ధరించిన రోజు నుండి వరుసగా 11 లేదా 21 లేదా 41 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసి, "ఓం స్కందాయ నమః" అనే పవిత్ర మంత్రాన్ని కనీసం 108 సార్లు భక్తితో జపించాలి.

వాక్కు శుద్ధి... శని దేవుని అనుగ్రహం

ఇక్కడ అందరూ తెలుసుకోవలసిన అత్యంత ఆసక్తికరమైన, ముఖ్యాంశం ఏమిటంటే... కరుంగలి మాల ధరించిన వారు ఎట్టిపరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పకూడదు. శాస్త్ర ప్రకారం మన వాక్కుకు 'శుక్రుడు' కారకుడు కాగా, మన కర్మలకు 'శని దేవుడు' కారకుడు. మనం నోటితో అబద్ధాలు ఆడితే వాక్కు అపవిత్రమై, శని గ్రహం అగ్రహిస్తుంది. శని దేవుని అనుగ్రహం కలిగి, జాతక దోషాలు తొలగాలంటే నాలుకపై ఎప్పుడూ సత్యమే పలకాలి. శౌచాలయానికి వెళ్లేటప్పుడు లేదా మైల ఉన్న ప్రదేశాలకు వెళ్లే ముందు ఈ మాలను భక్తితో తీసి దేవుడి పటం వద్ద ఉంచాలి. తిరిగి స్నానం చేసిన తర్వాతే ధరించాలి. కలియుగంలో మనల్ని పీడించే నరదృష్టి, ప్రతికూల శక్తుల నుండి రక్షణ పొందడానికి కరుంగలి మాల ఒక దివ్యౌషధం. మరి మన పూర్వీకులు చెప్పిన విధంగా మాలను ధరించి దుష్టశక్తుల నుంచి రక్షణ పొందుదామా.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story