Lucky Plants for Home: మీ ఇంటికి అదృష్టం మీరు కాదు... ఈ మొక్కలే... పూర్వీకులు చెప్పిన రహస్యం
ఇల్లు నిత్యం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో తులతూగాలంటే అదృష్టాన్ని తీసుకొచ్చే ఈ మొక్కలను ఇంట్లో పెంచాలి.
Lucky Plants for Home: మనం కష్టపడి పనిచేస్తేనే కదా డబ్బులు వచ్చేది...జీవితంలో స్థిరత్వం లభించేంది. అభ్యున్నతికి ఎదిగేది...ఇంటికి మనం అదృష్టం మనం కాకుండా మొక్కలని అంటున్నారేంటని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, ఇది అక్షర సత్యం. మనం ఎంత కష్టపడినా...ఎంత డబ్బు సంపాదించినా... ఎంత ఎత్తుకు ఎదిగినా... మనల్ని ఎన్నో విధాలుగా ఈ మొక్కలు రక్షిస్తుంటాయి. నరుల దిష్టి నుంచి ఆరోగ్య రక్షణ వరకు ఈ మొక్కలు ఓ రక్షణ కవచంలా నిత్యం మనచుట్టూ ఉంటాయి. ఈ మొక్కలు మనింటికి అందంమే కాదు... అదృష్టం కూడా. మరి ఆ మొక్కలేంటో చూద్దామా.
అదృష్టాన్ని తెచ్చే మొక్కలు
అదృష్టాన్ని తెచ్చే మొక్కల్లో మొదటగా మనం చెప్పుకోవలసింది ఆరే చెట్టు గురించే. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన మానసిక బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రతిరోజూ ఈ మొక్కకు నీరు పోయడం వలన అనుకున్న పనులు నెరవేరుతాయి. అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, చెడు శక్తులను కూడా మననుంచి దూరం చేస్తుంది ఈ మొక్క.
రెండోది మర్రిచెట్టు. ఇంట్లో మర్రిచెట్టు పెరగడాన్ని చాలామంది అశుభంగా చెబతారు. పాడుబడిన ఇల్లు లేదా దుష్టశక్తులకు ఆవాసంగా మారుతున్న ఇళ్లల్లో ఇలాంటి చెట్లు పెరుగుతాయని అంటారు. మర్రిచెట్టు అనేది దురదృష్టానికి సంకేతం ఏమాత్రం కాదు. ఇది మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన వృక్షం. దీనినే వటవృక్షం అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు స్థిరత్వానికి, శాశ్వతత్వానికి ప్రతిక. ఐక్యత పెరుగుతుంది. మనలో భగవంతుని పట్ల ప్రేమను పెంచుతుంది.
ఇవి కూడా అదృష్టమే
ఆరే, మర్రి చెట్లే కాదు... వేపచెట్టు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇంట్లో సంతోషం, శుభకరమైన వాతావరణాన్ని తీసుకురావడంలో వేపచెట్టు ఉపయోగపడుతుంది. వేపాకులు, పువ్వులు, కాయలను పూజలో, ఉత్సవాల సందర్భంగా, శుభకార్యాల్లోనూ ఉపయోగిస్తారు. చెడు శక్తులను దూరం చేయడంలో వేప మొదటిస్థానంలో ఉంటుంది.
ఇక ఇంట్లో సహజసిద్దంగా పెరిగే మనీప్లాంట్ ధనానికి, శ్రేయస్సుకు సంకేతం. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం మంచిదే. అయితే, ఈ మొక్కను ఏ దిశలో ఉంచాలో ఆ దిశలోనే పెంచాలి. లేదంటే ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇక అదృష్టాన్ని తీసుకొచ్చే మరోమొక్క అంజూర. దీనిని ఇంట్లో పెంచడం వలన ధైర్యం పెరుగుతుంది. స్థిరమైన జీవనానికి అంజూర దోహదపడుతుంది. అశోక చెట్టును కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను చేకూరుస్తుంది. కుటుంబంలో సానుకూల వాతావరణం నెలకొనేలా చేస్తుంది. చూశారు కదా ఈ మొక్కలు మనకు ఎంతగా సహకరిస్తున్నాయో. ఇంటికి అదృష్టం ఈ మొక్కలా... మనమా...మీరే చెప్పండి.




