Negative Energy: తాంత్రిక శక్తులకు ఇల్లు ఆవాసంగా మారిందా... ఎలా గుర్తించాలంటే
అందంగా ఉండే ఇల్లు క్రమంగా కళావిహీనంగా మారిపోతుందా... కుటుంబంలో అనవసరంగా కలహాలు పెరుగుతున్నాయా... ప్రతికూల శక్తులకు ఇల్లు ఆవాసంగా మారుతుందని అర్ధం.
Negative Energy: ఎంతో ఆనందంగా ఉండాల్సిన ఇల్లు హఠాత్తుగా వెలవెలబోతూ, కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతత కరువై నిరంతరం అలజడి నెలకొంటుంటే అది కేవలం సాదాసీదా సమస్య కాకపోవచ్చు! గృహంలో ప్రతికూల శక్తులు లేదా తాంత్రిక దోషాలు ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లోని వాతావరణం సంపూర్ణంగా మారిపోయి విపరీతమైన మనఃశాంతి లోపిస్తుందని ఆధ్యాత్మిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వాస్తు మరియు తాంత్రిక శాస్త్రాల ప్రకారం, ఇంట్లో ఉన్నట్టుండి తులసి మొక్క ఎండిపోవడం, అద్దాలు పగలడం, ఒకే గదిలో రెండు రకాల ఉష్ణోగ్రతలు ఉండటం మరియు విచిత్రమైన దుర్వాసనలు రావడం వంటివి నెగెటివ్ శక్తులు ఆవహించాయనడానికి ప్రధాన సంకేతాలు. ఈ ప్రతికూల ప్రభావాల వల్ల కుటుంబంలో విడాకుల వరకు వెళ్లే వివాదాలు, వ్యాపారాల్లో తీవ్ర ఆర్థిక నష్టాలు, క్రమం లేని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
గృహంలో కనిపించే దిగ్భ్రాంతికర మార్పులు
గదులలో బొగ్గు లేదా నెత్తురు వాసన రావడం, నిశ్శబ్ద వాతావరణంలో అస్పష్టమైన మూలుగులు, రొద శబ్దాలు వినిపించడం. గోడలపై తగిలించిన ఫోటోలు ఉన్నట్టుండి కిందపడటం, కొత్తగా ఉన్న అద్దాలు పగలడం, సరిగ్గా పనిచేసే గడియారాలు పదే పదే ఆగిపోవడం. ఇంట్లో ఎంతో శ్రద్ధగా పెంచే తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోవడం లక్ష్మీదేవి అనుగ్రహం క్షీణించిందనడానికి సంకేతం. అదేవిదంగా ఇంట్లోని కుక్కలు లేదా ఇతర జంతువులు ఒకే దిశగా చూస్తూ విపరీతంగా అరవడం కూడా తాంత్రిక శక్తులు ఇంట్లో ఉన్నాయని చెప్పడానికి నిదర్శనం. అంతేకాదు, ప్రతికూల శక్తులు పెరిగినపుడు ఉదయం లేచినప్పటి నుండి కారణం లేకుండా శరీరం తీవ్రంగా అలసిపోవడం, తరచుగా తలనొప్పి, జ్వరం రావడం జరుగుతుంది. అంతేకాక భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగి బంధాలు తెగిపోయే ప్రమాదం ఉంటుంది.
ఇంట్లోని ప్రతికూల శక్తులను తరిమికొట్టడానికి 21 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం గుగ్గిలం, సాంబ్రాణి ధూపం వేయడం, ఇంట్లో ఉప్పు నీటితో తుడుచుకోవడం, రోజూ సుందరకాండ లేదా మహా మృత్యుంజయ మంత్ర పఠనం చేయడం ద్వారా నెగెటివ్ ప్రభావాలు తొలగిపోయి తిరిగి ఇల్లు స్వర్గసీమగా మారుతుందని వేద పండితులు సూచిస్తున్నారు. ఇలాంటి సూచనలు కనిపించినపుడు తాత్కాలికంగా ఉపశమనం లభించాలంటే నిత్యం ఇంట్లో గుగ్గిలం లేదా సాంబ్రాణి వేస్తుండాలి. దీని ద్వారా ప్రతికూల శక్తుల నుంచి రక్షణ లభిస్తుంది.




