Haircut Calendar: పెద్దలు చెప్పిన రహస్యం... ఈ తేదీల్లో జుట్టు కత్తిరించుకుంటే... కనకవర్షమే
అక్టోబర్ 2026లో జుట్టు కత్తిరించుకోవడానికి శుభదినాలు ఏవి? జుట్టు పొడవు, బలం, అందం, ఉద్యోగం, ధనలాభం కోసం సూచించిన ప్రత్యేక తేదీలను గురించి తెలుసుకుందాం.
Haircut Calendar: అక్టోబర్‌లో జుట్టు కత్తిరించుకోవడానికి కూడా కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉన్నాయని ఆధ్యాత్మిక, చంద్రచక్ర విశ్వాసాలు చెబుతున్నాయి. సాధారణంగా జుట్టు కట్ చేయించుకోవడం అనేది మనకు నచ్చిన రోజు, సౌకర్యంగా ఉన్న సమయాన్ని బట్టి జరుగుతుంది. కానీ జుట్టు పెరుగుదల, ఆరోగ్యం, అందం, అదృష్టం వంటి అంశాలను చంద్రుని గమనంతో ముడిపెట్టి చూసే సంప్రదాయాలు కూడా ఉన్నాయి. ఈ నమ్మకాల ప్రకారం అక్టోబర్ 2026లో జుట్టు కత్తిరించుకోవడానికి కొన్ని తేదీలను ప్రత్యేకంగా సూచిస్తున్నారు.
జుట్టు కత్తిరించుకునే రోజుకు ఇంత ప్రాధాన్యమా?
మన రూపాన్ని మార్చడంలో జుట్టుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. హెయిర్‌కట్ చిన్న మార్పే అయినా ముఖం మొత్తం లుక్‌ను మార్చేస్తుంది. అందుకే జుట్టును కేవలం అందానికి సంబంధించిన అంశంగా కాకుండా, వ్యక్తిగత శక్తి, జీవశక్తి, పునరుద్ధరణకు ప్రతీకగా భావించే సంప్రదాయాలు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. చంద్రుడి కళలు, శరీరంలోని సహజ మార్పులకు మధ్య సంబంధం ఉందనే జానపద విశ్వాసం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే జుట్టు కత్తిరించే తేదీని కూడా చంద్రచక్రానికి అనుసంధానించి చూడటం కొందరిలో కనిపిస్తుంది. అయితే ఇవి ఆధ్యాత్మిక, జానపద విశ్వాసాల ఆధారమైన విషయాలు మాత్రమే.
జుట్టు పొడవుగా పెరగాలంటే..
మీ లక్ష్యం జుట్టును పొడవుగా పెంచుకోవడమే అయితే అక్టోబర్ 3 లేదా 4 తేదీల్లో హెయిర్‌కట్ చేయించుకోవచ్చని ఈ విశ్వాసం చెబుతోంది. ముఖ్యంగా జుట్టు నెమ్మదిగా పెరుగుతోందని అనుకునేవారు ఈ తేదీలను పరిగణనలోకి తీసుకోవచ్చు. అంతేకాదు, జుట్టు పొడవు కంటే దాని బలం, విరిగిపోవడం, పలుచబడటం వంటి విషయాలపై దృష్టి ఉన్నవారికి అక్టోబర్ 9 నుంచి 13 వరకు తేదీలను సూచిస్తున్నారు. అంటే ఈ ఐదు రోజులలో ఏ రోజైనా హెయిర్ ట్రిమ్ చేసుకోవచ్చని ఈ సంప్రదాయ నమ్మకం.
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే..
జుట్టుకు మరింత వాల్యూమ్, మందం, మంచి టెక్స్చర్ రావాలని కోరుకునేవారికి అక్టోబర్ 21, 22, 23 తేదీలు అనుకూలంగా ఉంటాయని చెబుతున్నారు. హెయిర్‌స్టైల్‌లో మార్పు చేయాలనుకునేవారికి కూడా ఈ తేదీలు ఆసక్తికరంగా ఉండొచ్చు. ఇక, జుట్టు మూలాలు ఆరోగ్యంగా ఉండటం మొత్తం హెయిర్ క్వాలిటీకి కీలకం. రూట్ కేర్ లేదా సంబంధిత హెయిర్ ట్రీట్‌మెంట్ కోసం అక్టోబర్ 16, 17, 18 తేదీలను ఎంచుకోవచ్చని ఈ విశ్వాసం సూచిస్తోంది. దీంతోపాటు, హెయిర్‌స్టైల్‌నే మీ లుక్‌లో ప్రధాన ఆకర్షణగా మార్చుకోవాలనుకుంటే నెల చివరి రోజులు ప్రత్యేకంగా చెబుతున్నారు. అక్టోబర్ 26 నుంచి 31 వరకు హెయిర్‌కట్ లేదా ట్రిమ్ చేయించుకోవడం అందం, ఆకర్షణకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.
డబ్బు, ఉద్యోగం కోసం ప్రత్యేక తేదీలు
ఈ క్యాలెండర్‌లో ఆర్థిక విషయాలకు కూడా కొన్ని తేదీలను ప్రత్యేకంగా సూచించారు. అక్టోబర్ 3న ప్రమోషన్ కోసం, అక్టోబర్ 13న అనుకోని ధనలాభం లేదా బోనస్ కోసం, అక్టోబర్ 19 లేదా 20 తేదీల్లో కొత్త ఉద్యోగ అవకాశాల కోసం హెయిర్‌కట్ చేయించుకోవచ్చని చెబుతున్నారు. ఇక ఆస్తులు, సంపద పెరగాలని కోరుకునేవారికి అక్టోబర్ 25, 28, 29 తేదీలను సూచించారు. అంటే అక్టోబర్‌లో హెయిర్‌కట్ కోసం తేదీ ఎంచుకునేటప్పుడు కేవలం ఖాళీ సమయాన్ని కాకుండా, మీకు కావాల్సిన ఫలితాన్ని బట్టి తేదీని ఎంచుకోవచ్చనే ఆసక్తికరమైన నమ్మకం ఇందులో ఉంది. అయితే జుట్టు ఆరోగ్యం విషయంలో శాస్త్రీయంగా నిరూపితమైన హెయిర్ కేర్ పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా అంతే ముఖ్యం.




