Peacock Feathers: ఇంట్లో నెమ‌లి ఈక‌లు ఎందుకుండాలి.? సైంటిఫిక్ రీజ‌న్ కూడా ఉందని తెలుసా

Peacock Feathers: హిందూ సంప్రదాయంలో నెమలి ఈకలకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే కొంతమంది ఇంట్లో అలంకరణ కోసం మాత్రమే కాకుండా శుభ సూచకంగా కూడా నెమలి ఈకలను ఉంచుకుంటారు.

Mokshith
Published on: 31 March 2026 4:13 PM IST
Peacock Feathers
X

Peacock Feathers: ఇంట్లో నెమ‌లి ఈక‌లు ఎందుకుండాలి.? సైంటిఫిక్ రీజ‌న్ కూడా ఉందని తెలుసా

Peacock Feathers: హిందూ సంప్రదాయంలో నెమలి ఈకలకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే కొంతమంది ఇంట్లో అలంకరణ కోసం మాత్రమే కాకుండా శుభ సూచకంగా కూడా నెమలి ఈకలను ఉంచుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం నెమలి ఈకల ప్రాధాన్య‌త గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ సంప్రదాయంలో నెమలి ఈక ప్రాధాన్యం

పురాణాల ప్రకారం నెమలి ఈక శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే దీనిని శుభానికి ప్రతీకగా భావిస్తారు. కొన్ని వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంట్లో నెమలి ఈకలు ఉంటే ప్రతికూల శక్తులు తగ్గి సానుకూల శక్తి పెరుగుతుందని అంటారు. అంతేకాదు ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడేందుకు కూడా ఇది సహాయపడుతుందని విశ్వసిస్తారు.

ఏ దిశ‌లో ఉంచితే మంచిది.?

వాస్తు నిపుణుల సూచనల ప్రకారం నెమలి ఈకలను ఉంచే దిశను బట్టి ఫలితాలు మారుతాయని అంటారు. కుటుంబంలో ఆర్థిక స్థిరత్వం రావాలని కోరుకునే వారు నెమలి ఈకలను తూర్పు లేదా ఆగ్నేయ దిశలో ఉంచడం మంచిదని చెబుతారు. జాతకంలో రాహు ప్రభావం ఉందని భావించే వారు లేదా పనుల్లో తరచూ ఆటంకాలు ఎదుర్కొనే వారు వాయువ్య దిశలో ఉంచితే మంచిదని కొందరు సూచిస్తారు. దాంపత్య జీవితంలో శాంతి కోసం పడకగదిలో దక్షిణ దిశలో ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని కూడా అంటారు.

శాస్త్రీయ కోణంలో ఏమి చెబుతున్నారు?

కొన్ని పరిశోధనలు నెమలి ఈకలలోని రంగులు మనసుపై ప్రభావం చూపుతాయని చెబుతున్నాయి. నీలం, ఆకుపచ్చ రంగుల కలయిక మనసుకు ప్రశాంతతను కలిగించడంలో సహాయపడుతుందని పర్యావరణ సైకాలజీకి సంబంధించిన అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలాగే ఈక మధ్యలో కనిపించే ‘కన్ను’ ఆకారం ఏకాగ్రతను పెంచుతుందని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. అందుకే కొంతమంది పిల్లల స్ట‌డీ రూమ్‌లో కూడా నెమలి ఈకలను ఉంచడం మంచి అలవాటని చెబుతారు.

నెమలి ఈకలను ఉంచేటప్పుడు పాటించాల్సిన నియమాలు

వాస్తు నమ్మకాల ప్రకారం నెమలి ఈకలను బేసి సంఖ్యలో ఉంచడం మంచిదని అంటారు. ఉదాహరణకు 3, 5, 7 లేదా 11 ఈకలు ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. విరిగిపోయిన లేదా మురికి పట్టిన ఈకలను ఉపయోగించకపోవడం మంచిది. అలాగే వీటిని శుభ్రంగా ఉంచడం కూడా ముఖ్యమని చెబుతారు. కొందరు ప్రతి శుక్రవారం మెత్తని వస్త్రంతో తుడవాలని సూచిస్తారు.

ఈ తప్పులు మాత్రం చేయకూడదు

నెమలి ఈకలను ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు పూజ గదిలో ఉంచుతారు కానీ కొన్ని వాస్తు అభిప్రాయాల ప్రకారం అది సరైన స్థానం కాదని చెబుతారు. అలాగే నేలపై పడేలా ఉంచకూడదు. పాదాల దగ్గర లేదా నిద్రించే చోట కాళ్లకు తగిలేలా ఉంచకూడదు. అవసరమైతే దిండు దగ్గర ఉంచుకోవచ్చు. సరైన విధంగా ఉంచితే నెమలి ఈకలు ఇంటికి అందం మాత్రమే కాదు, సానుకూల వాతావరణాన్ని కూడా తీసుకువస్తాయని నమ్మకం ఉంది.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన అంశాల‌ను ఇంట‌ర్నెట్ వేదిక‌గా అందుబాటులో ఉన్న స‌మాచారం ఆధారంగా అందించ‌డ‌మైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని రీడ‌ర్స్ గ‌మ‌నించాలి.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story