Ramzan History: రంజాన్ పండగను ఎందుకు జరుపుకుంటారు.? దీని చరిత్ర ఏంటో తెలుసా.?
Ramzan History: ముస్లింలకు ఎంతో ముఖ్యమైన పండగల్లో రంజాన్ ఒకటి. ఈ సందర్భంగా ముస్లింలు నెల రోజుల పాటు ఎంతో కఠినమైన ఉపవాస దీక్షను చేపడుతారు. అలాగే రంజాన్ నెల ముగిసిన రోజును ఈద్ అల్ ఫిక్తర్ పేరుతో పండుగ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో రంజాన్ పండగ చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Ramzan History: రంజాన్ పండగను ఎందుకు జరుపుకుంటారు.? దీని చరిత్ర ఏంటో తెలుసా.?
Ramzan History: ముస్లింలకు ఎంతో ముఖ్యమైన పండగల్లో రంజాన్ ఒకటి. ఈ సందర్భంగా ముస్లింలు నెల రోజుల పాటు ఎంతో కఠినమైన ఉపవాస దీక్షను చేపడుతారు. అలాగే రంజాన్ నెల ముగిసిన రోజును ఈద్ అల్ ఫిక్తర్ పేరుతో పండుగ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో రంజాన్ పండగ చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈద్ అల్ ఫిత్ర్ 2026: తేదీ, చరిత్ర, ప్రాముఖ్యత
ముస్లింలకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటైన Eid al-Fitr ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. రంజాన్ నెల ముగిసిన తర్వాత వచ్చే ఈ పండుగ ఆనందం, కృతజ్ఞత, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. 2026లో గల్ఫ్ దేశాల్లో మార్చి 20న ఈద్ జరగగా, భారత్‌లో సాధారణంగా ఒక రోజు తర్వాత, అంటే మార్చి 21న జరుపుకుంటున్నారు.
ఈద్ తేదీలు ఎలా నిర్ణయిస్తారు?
ఈద్ అల్ ఫిత్ర్ తేదీ చంద్రుడు కనిపించిన దానిపై ఆధారపడి ఉంటుంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం షవ్వాల్ నెల మొదటి రోజున ఈ పండుగ జరుపుకుంటారు. సౌదీ అరేబియా వంటి దేశాల్లో నెలవంక కనిపించిన వెంటనే ఈద్ ప్రకటిస్తారు. దక్షిణాసియా దేశాలు మాత్రం సాధారణంగా ఒక రోజు ఆలస్యంగా ఈ పండుగను జరుపుకుంటాయి.
రంజాన్ ప్రత్యేకత ఏంటి?
రంజాన్ ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెల. ఈ సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండటం ముఖ్య ఆచారం. దీన్ని రోజా అంటారు. ఇది కేవలం ఆకలిని నియంత్రించడం మాత్రమే కాదు, మనసును శుద్ధి చేసుకోవడం, చెడు అలవాట్లను వదిలేయడం, పేదలకు సహాయం చేయడం వంటి విలువలను పెంపొందించే సమయం. రంజాన్ ముగిసిన ఆనందాన్ని ఈద్ ద్వారా వ్యక్తం చేస్తారు.
ఈద్ అల్ ఫిత్ర్ చరిత్ర
ఈ పండుగకు గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది. ప్రొఫెట్ మహమ్ముద్ కాలంలో ఈద్ అల్ ఫిత్ర్ ప్రారంభమైంది. ఆయన ముస్లింల కోసం రెండు ప్రధాన పండుగలను ప్రవేశపెట్టారు. వాటిలో ఈద్ అల్ ఫిత్ర్ ఒకటి. రంజాన్ నెలలో చేసిన ప్రార్థనలు, ఉపవాసాల తర్వాత ఆనందంగా జరుపుకునే రోజు ఇది.
ఈద్ రోజున జరిగే వేడుకలు
ఈద్ రోజున ఉదయం ప్రత్యేకంగా ఈద్ నమాజ్ నిర్వహిస్తారు. మసీదుల్లో లేదా ఓపెన్ ప్రదేశాల్లో ఈ ప్రార్థనలు జరుగుతాయి. అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకుంటారు. ఈ రోజున ఖీర్, ఫిర్నీ వంటి తీపి వంటకాలు తయారు చేస్తారు. అందుకే దీనిని “మీతి ఈద్” అని కూడా అంటారు. ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటూ “ఈద్ ముబారక్” అని శుభాకాంక్షలు చెప్పడం సంప్రదాయం.
ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటి?
ఈద్ అల్ ఫితర్ కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది కృతజ్ఞతను తెలియజేసే రోజు. అల్లాహ్ కృపకు ధన్యవాదాలు చెప్పడం, పేదలకు జకాత్ రూపంలో సహాయం చేయడం, సమాజంలో ప్రేమ, ఐక్యత పెంచడం ఈ పండుగ ప్రధాన లక్ష్యాలు. కుటుంబాలు, సమాజం కలిసికట్టుగా ఆనందంగా ఉండేలా చేసే ప్రత్యేక సందర్భం ఇది.




