Tirumala Temple Secrets: తిరుమలలో ఈ రహస్యం గురించి 90 శాతం మందికి తెలియదు

కలియుగదైవం శ్రీవేంకటేశ్వ స్వామివారి ఆలయంలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. ఈ ఆలయం కేవలం రాతి కట్టడం కాదు..స్వామివారు స్వయంగా నివశించే ఆనందనిలయం అని చెప్పడానికి ఇదొక నిదర్శనం.

Balachander
Published on: 11 July 2026 10:10 AM IST
Tirumala Temple Secrets: తిరుమలలో ఈ రహస్యం గురించి 90 శాతం మందికి తెలియదు
X

Tirumala Temple Secrets: కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామిని ఒక్కసారి కన్నులారా దర్శించుకుంటే చాలు, జన్మ ధన్యమౌతుందని కోట్లాది మంది భక్తులు నమ్ముతారు. తిరుమలలో వెలిసిన ఆ స్వామివారి రూపం కేవలం ఒక శిలా విగ్రహం కాదు, సాక్షాత్తూ ఆ పరమాత్ముడు స్వయంభూవుగా వెలిసిన సజీవ స్వరూపం. అందుకే ఆ దివ్య మంగళ విగ్రహం వెనుక ఎన్నో శతాబ్దాలుగా ఎవరికీ అంతుచిక్కని, సైన్స్‌కు కూడా అందని కొన్ని అద్భుత రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిలో 90 శాతం మంది సామాన్య భక్తులకు తెలియని ముఖ్యమైన ఆధ్యాత్మిక విశేషాలు ఇప్పుడు చూద్దాం.

స్వామివారికి నిరంతరం పెరిగే జుట్టు

సాధారణంగా రాతి విగ్రహాలకు జుట్టు ఉండటం మనం ఎక్కడా చూడము. కానీ తిరుమల శ్రీవారి తలపై పట్టులాంటి పవిత్రమైన జుట్టు ఉంటుంది. ఈ కేశాలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయని, అందుకే వాటిని అర్చకులు శాస్త్రోక్తంగా కత్తిరించి, అత్యంత రహస్యంగా ఉంచుతారని ప్రతీతి.

22 కిలోమీటర్ల దూరంలోని రహస్య గ్రామం

తిరుమల కొండలపై స్వామివారి నిత్య కైంకర్యాలకు, పూజలకు ఉపయోగించే పాలు, వెన్న, పత్రాలు, సుగంధ పుష్పాలు అన్నీ ఒకే ఒక్క ప్రత్యేక ప్రాంతం నుండి వస్తాయి. తిరుపతికి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఒక రహస్య గ్రామం ఉంది. ఈ గ్రామంలోనికి పరాయి వ్యక్తులకు లేదా సామాన్య ప్రజలకు ప్రవేశం లేదు. అక్కడ నివసించే నిష్ఠావంతులైన భక్తులు మాత్రమే స్వామివారికి కావాల్సిన పవిత్ర వస్తువులను సిద్ధం చేసి ప్రతిరోజూ తిరుమలకు పంపుతారు.

గర్భాలయంలో వినిపించే సముద్ర ఘోష

స్వామివారి దివ్య రూపం వెనుక భాగంలో చెవి ఉంచి నిశితంగా గమనిస్తే, భీకరమైన అలల శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. ఈ అద్భుతం కేవలం స్వామివారి విగ్రహం వద్దే కాదు, గర్భాలయం వెనుక వైపు ఉన్న గోడకు చెవి ఆన్చినా భక్తులకు అనుభవంలోకి వస్తుంది. అయితే, పూర్వజన్మ సుకృతం ఉన్నవారికే ఈ శబ్దం గోచరిస్తుందని ప్రధాన అర్చకులు చెబుతుంటారు.

ఎప్పటికీ ఆరని వెనుకభాగపు తడి

శ్రీవారి నిలువెత్తు రూపంలో ఉన్న మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, స్వామివారి వెనుకభాగం ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఉదయం అభిషేకం చేసినా, రాత్రి ఏకాంత సేవ చేసినా... పట్టు వస్త్రంతో ఎన్నిసార్లు తుడిచినా సరే, ఆ వెనుకభాగం మాత్రం నిరంతరం తేమతోనే ఉంటుంది. ఈ రహస్యాలన్నీ తిరుమల క్షేత్రం కేవలం రాతి కట్టడం కాదు, సాక్షాత్తూ నారాయణుడు కొలువై ఉన్న పవిత్ర ధామం అని నిరూపిస్తున్నాయి. శరణు కోరిన భక్తులను బ్రోచే ఆ వేంకటరమణుని లీలలు మానవ మాత్రుల ఊహకు అందవు అనడానికి ఈ అద్భుతాలే ప్రత్యక్ష సాక్ష్యాలు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story