Vaishakha Purnima 2026: వైశాఖ పున్నమి నాడు లక్ష్మీదేవికి ఇవి కానీ సమర్పించారంటే!
Vaishakha Purnima 2026 date: వైశాఖ పున్నమి రోజున లక్ష్మీదేవి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున కొన్ని నైవేద్యాలు సమర్పిస్తే శ్రేయస్సు, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం.
Vaishakha Purnima
Vaishakha Purnima 2026 date: హిందూ పండుగలలో ప్రతి రోజుకి ఓ ప్రత్యేకత ఉంటుంది. వాటిలో మరీ ముఖ్యమైనది పౌర్ణమి. పున్నమి నాటు నదిలో పవిత్ర స్నానాలు , దానాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతుంటారు.వీటి అన్నిటిలోకి కూడా వైశాఖ పున్నమి చాలా ముఖ్యమైనదిగా చెబుతుంటారు. వైశాఖ మాసం చాలా ముఖ్యమైనదిగా పండితులు వివరిస్తుంటారు.
విష్ణువు ఆరాధన..
వైశాఖ మాసం విష్ణువు ఆరాధన దానధర్మాలకు చాలా ప్రయోజనకరంగా పండితులు వివరిస్తుంటారు.వైశాఖ పున్నమినాడు నదీ స్నానం చేయడం, దానాలు చేయడంతో పాటు విష్ణువుమూర్తిని పూజించడం వల్ల చాలా సమస్యల నుంచి బయటపడవచ్చు.ఈ ఏడాది వైశాఖ పున్నమి ఏప్రిల్ 30 న వచ్చింది.
వైశాఖ పున్నమిని..
ప్రతి ఏడాది వైశాఖ మాసంలోని శుక్లపక్షం పదిహేనో రోజున వైశాఖ పున్నమిని జరుపుకుంటారు. ఈ రోజున నదీ స్నానం , దానధర్మాలు చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయనే విషయం గురించి పెద్దలు వివరిస్తుంటారు.పున్నమి నాడు సంపదకి దేవత అయిన లక్ష్మీదేవిని ,విష్ణువుని పూజించే ఆచారం ఉంది. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడంతో పాటు ఈ వస్తువులను కూడా సమర్పిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనమీద ఉంటాయని చాలామంది భక్తులు నమ్ముతుంటారు.
ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపదకి ,ఆహారానికి ఎలాంటి కొరత ఉండదని చాలా మంది విశ్వసిస్తుంటారు.
పున్నమి నాడు లక్ష్మీదేవికి వీటిని కానీ సమర్పిస్తే ఆమె ఆశీస్సులు ఎల్లప్పుడూ మనమీదనే ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే...
పరమాన్నం లేదా బియ్యం పాయసం:
లక్ష్మీదేవికి పాయసం అంటే ఎంతో ప్రీతికరం. కనుక వైశాఖ పూర్ణిమ రోజున అమ్మవారికి కచ్చితంగా తామర గింజలతో లేదా బియ్యంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ఆమె దీవెనలు ఎల్లప్పుడూ మన మీద ఉంటాయని పండితులు చెబుతుంటారు.
స్వీట్లు: పున్నమి రోజున తెలుపు రంగులో ఉండే స్వీట్లు లేదా పాలతో చేసిన కోవా వంటివి లక్ష్మీ దేవికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి కరుణకటాక్షలు ఎల్లప్పుడూ మనమీద ఉంటాయి.
కొబ్బరికాయ: ప్రతి పూజలో ఎంతో ముఖ్యమైన కొబ్బరికాయను సంపద దేవతకు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సును కొనసాగిస్తుందని పండితులు వివరిస్తున్నారు.
తామర పువ్వు: తామర పువ్వు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. అటువంటి పరిస్థితిలో వైశాఖ పూర్ణిమ రోజున లక్ష్మీ దేవికి తామర పువ్వును సమర్పిస్తే ఆమె చల్లని చూపు మనమీద ఉంటుంది.




