Varahi Devi: వారాహి నవరాత్రులు - నరదిష్టిని దూరం చేసే ఉన్మత్త వారాహి.. ఎలా ఆరాధించాలంటే

గుప్త నవరాత్రుల్లో భాగంగా ఆరో రోజు వారాహిని ఉన్మత్త వారాహిగా ఆరాధిస్తారు. అమ్మవారిని ఆరాధించడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

Balachander
Published on: 21 July 2026 9:37 AM IST
Varahi Devi: వారాహి నవరాత్రులు - నరదిష్టిని దూరం చేసే ఉన్మత్త వారాహి.. ఎలా ఆరాధించాలంటే
X

Varahi Devi: ఇతరుల ఈర్ష్య, నరదిష్టి, తాంత్రిక బాధలతో నిత్యం నష్టపోతూ చేతిలో డబ్బు నిలవడంలేదని నలిగిపోయే వారికి సాక్షాత్తు ఉన్మత్త వారాహి ఉపాసన ఒక అద్భుతమైన దివ్య రక్షణ కవచం! ఆషాఢ నవరాత్రులలో అత్యంత శక్తివంతమైన ఆరో రోజున వారాహి అమ్మవారిని 'ఉన్మత్త వారాహి' స్వరూపంలో ఉపాసించడం వల్ల ఎటువంటి నరదృష్టి మరియు దుష్ట శక్తుల ప్రభావాలైనా క్షణాల్లో పటాపంచలవుతాయని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పవిత్రమైన రోజున రాళ్ల ఉప్పుపై 'ఐశ్వర్య దీపం' వెలిగించడం వల్ల ఇంట్లో ధన నిలకడ పెరగడమే కాకుండా, కొబ్బరి అన్నం నైవేద్య సమర్పణతో తీవ్రమైన తాంత్రిక దోషాలు తొలగిపోతాయి.

రాళ్ల ఉప్పుపై 'ఐశ్వర్య దీపం' ... ధన నిలకడ

ఈ రోజున అమ్మవారి ముందు ఒక ప్రమిదలో లేదా పాత్రలో శుద్ధమైన రాళ్ల ఉప్పును ఉంచి, దానిపై దీపాన్ని స్థాపించి వెలిగిస్తారు. ఈ ఐశ్వర్య దీపం ఇంట్లోని ప్రతికూల శక్తిని పీల్చివేసి, లక్ష్మీదేవి కటాక్షాన్ని, స్థిరమైన ధన ప్రాప్తిని కలిగిస్తుంది. అంతేకాదు, ఈరోజు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన కొబ్బరి అన్నంను నివేదన చేస్తారు. ఈ అన్నాన్ని నైవేద్యంగా సమర్పించడం వలన వ్యాపారంలో ఉన్న నరదిష్టి, శతృవుల నుండి వచ్చే తాంత్రిక లేదా నజరు బాధలు తొలగిపోతాయి. ధనం నిలకడగా ఉంటుంది. ఈరోజు అమ్మవారి దివ్య అనుగ్రహం కోసం ఉన్మత్త వారాహి మహాదేవి సర్వ జనం మమ వశం కురు కురు స్వాహా అనే ఈ శక్తివంతమైన మంత్రాన్ని కనీసం 108 సార్లు అత్యంత భక్తి శ్రద్ధలతో పఠించడం వల్ల సమాజంలో ఆకర్షణ, ఉద్యోగ వ్యాపారాలలో జనాదరణ పెరిగి అనుకున్న కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story