Vastu: అక్వేరియంను ఈ దిశలో కానీ ఉంచారంటే..లక్ష్మీదేవి మీ ఇంట్లోనే!
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో అక్వేరియంను సరైన దిశలో ఉంచితే సానుకూల శక్తి పెరిగి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని నమ్మకం. చేపల సంఖ్య, పరిశుభ్రత కూడా ముఖ్యమని చెబుతున్నారు.
Aquarium vastu tips
Vastu Tips For Aquarium:వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలోని ప్రతి చిన్న, పెద్ద అంశం జీవితంలోని శక్తి, అదృష్టంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో తెలుస్తుంది. ఇంట్లో ఉండే అనేక వస్తువులతో పాటు చేపల అక్వేరియం కూడా ఒకటి. ఇది కేవలం అలంకరణ వస్తువు మాత్రమే కాదు, వాస్తు శాస్త్రంలో దీనిని సానుకూల శక్తికి, అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. సరైన స్థానంలో ఉంచిన అక్వేరియం ఇంట్లో ప్రశాంతమైన, సమతుల్యమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అయితే, చాలా మందికి దాని సరైన దిశ గురించి తెలియదు. కాబట్టి, ఇంట్లో చేపల అక్వేరియంను ఉంచడానికి సంబంధించిన వాస్తు నియమాలను తెలుసుకుందాం.
అక్వేరియం వాస్తు ప్రాముఖ్యత
వాస్తు శాస్త్రం ప్రకారం, నీరు, చేపలు జీవశక్తికి ప్రవాహానికి ప్రతీకలుగా చెబుతుంటారు. ఇంట్లో అక్వేరియం ఉంచడం వల్ల పరిసరాల్లోని ప్రతికూల శక్తి తగ్గి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అందుకే దీనిని శుభప్రదమైనదిగా, ప్రయోజనకరమైనదిగా పండితులు చెబుతుంటారు.
అక్వేరియంను సరైన దిశలో ఉంచండి
అక్వేరియం పెట్టడానికి ఇంటికి ఉత్తరం లేదా తూర్పు వైపు అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ దిశలు సంపద, పురోగతి, సానుకూల శక్తితో ముడిపడి ఉంటాయి. దీనిని దక్షిణం లేదా నైరుతి దిశలో పెట్టడం వల్ల సానుకూల ప్రభావాలు తగ్గుతాయి, కాబట్టి దిశపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ముఖ్యం.
చేపల సంఖ్య- ప్రాముఖ్యత
వాస్తు ప్రకారం, అక్వేరియంలోని చేపల సంఖ్య కూడా ముఖ్యమైనదిగా పండితులు వివరిస్తున్నారు. సాధారణంగా, తొమ్మిది చేపలను ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. అంతేకాకుండా వాటిలో ఒక నల్ల చేపను చేర్చాలని సిఫార్సు కూడా అంటుంటారు. నల్ల చేప ప్రతికూల శక్తిని తగ్గిస్తుందని, మిగిలిన చేపలు సానుకూలతను పెంచుతాయని నమ్ముతారు.
శ్రద్ధతో మంచి ఫలితాలు పెరుగుతాయి
అక్వేరియంను శుభ్రంగా ఉంచడం, నీటి నాణ్యతను కాపాడటం చాలా ముఖ్యం. మురికి నీరు లేదా అనారోగ్యంగా ఉన్న చేపలు మీ ఇంటి వాతావరణంపై ప్రభావం చూపుతాయి. అందువల్ల, క్రమం తప్పని సంరక్షణ దీర్ఘకాలిక సానుకూల ప్రభావాలను అందిస్తుంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద నమ్మకాలపై ఆధారపడి ఉంది. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.




