Bhairava at Home: వందశాతం నిజం... భైరవుడిని ఇంట్లో ఇందుకే పెట్టుకోవాలి
ఇంట్లో శునకాలను లేదా భైవరుడి విగ్రహాన్ని ఉంచుకోవడం వలన శనిదోషాలు, రాహుకేతు దోషాలతో పాటు కొన్ని ప్రత్యేక తిథుల్లో ఇంటి విషయాలను కూడా అవి మనకు తెలియజేస్తాయి.
Bhairava at Home: సనాతన హిందూ ధర్మంలో భైరవ ఆరాధనకు, ఆయన వాహనమైన శునకానికి అత్యంత పవిత్రమైన ప్రాధాన్యత ఉంది. లౌకిక ప్రపంచానికి కంటికి కనిపించని ఆత్మల ఉనికిని, నకారాత్మక శక్తులను ముందుగానే గుర్తించే అద్భుతమైన దివ్యశక్తి శునకాలకు ఉందని జ్యోతిష్య, మంత్ర శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుకే శునకాలను భూలోకానికి, పరలోకానికి మధ్య వారధిగా భావిస్తారు. సాక్షాత్తు కాలభైరవుని స్వరూపంగా భావించే శునకాలను ఇంట్లో పెంచుకోవడం లేదా వాటిని ఆదరించడం వల్ల గృహంలో ఉండే నజర్ దోషాలు, చేతబడి వంటి తాంత్రిక ప్రయోగాలు, దుష్టశక్తుల ప్రభావం 100 శాతం తొలగిపోతుందని పండితులు స్పష్టం చేస్తున్నారు.
ఆత్మల ఉనికిని శునకాలు ఎలా గుర్తిస్తాయి?
గ్రహాల కదలికలు మారినప్పుడు లేదా కొన్ని తిథులలో విశ్వంలో ఉండే శక్తుల సమతుల్యత దెబ్బతింటుంది. అటువంటి సమయాల్లో కుక్కలు వింతగా ప్రవర్తిస్తూ మనకు కొన్ని సంకేతాలను ఇస్తాయి. ఇంట్లో ఏదైనా అదృశ్య శక్తి లేదా ఆత్మ సంచరిస్తుంటే, శునకాలు ఆ గదిలోకి వెళ్లడానికి అస్సలు ఇష్టపడవు. ఒకవేళ బలవంతంగా తీసుకెళ్లినా, శూన్యంలోకి లేదా గదిలోని ఒక నిర్దిష్ట మూల వైపు చూస్తూ వింతగా మొరుగుతాయి. అమావాస్య తిథి నాడు చంద్రుని శక్తి క్షీణించి ఆత్మల ఉనికి, శక్తి రెండు రెట్లు పెరుగుతుంది. ఆ సమయంలో కుక్కలు నిద్రపోకుండా అసౌకర్యంగా ఉంటూ, రాత్రి వేళల్లో ఊళ వేయడం లేదా ఏడవడం చేస్తుంటాయి. సూర్య, చంద్ర గ్రహణాల సమయంలో విశ్వంలో సాత్విక శక్తి తగ్గి దుష్టశక్తుల ప్రభావం పెరుగుతుంది. ముఖ్యంగా శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉండేవారిపై ఈ శక్తులు దాడి చేయకుండా, కాలభైరవ అనుగ్రహం ఉన్న శునకాలు తమ అరుపులతో గృహాన్ని అప్రమత్తం చేస్తాయి.
భైరవుడిని ఇంట్లో ఎందుకు ఉంచుకోవాలి
"భైరవాయ నమస్తుభ్యం నమస్కారంచ రక్షక" అంటోంది శాస్త్రం. అంటే... కాలభైరవుని అనుగ్రహం ఉన్నచోట ఏ మంత్ర, తంత్ర శక్తులు పని చేయవు. శునకాలకు నిత్యం ఆహారం పెట్టడం వల్ల రాహు, కేతు, శని దోషాలు తొలగిపోతాయి. కాబట్టి, మీ ఇంట్లో లేదా వీధిలో ఉండే శునకాలు వింతగా ప్రవర్తిస్తున్నప్పుడు భయపడకుండా, అవి భైరవుని ఆజ్ఞతో మనకు సంకేతాలు ఇస్తున్నాయని గ్రహించాలి. నిత్యం మూగజీవాలైన వీధి కుక్కలకు కాస్త అన్నం లేదా రొట్టె పెట్టడం అలవాటు చేసుకోండి. ఆ భైరవ స్వరూపమే మీ ఇంటికి, మీ కుటుంబానికి శ్రీరామరక్షగా నిలుస్తుంది.




