Hardik Pandya Trolls: మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఎప్పుడు ఆడావో గుర్తుందా.. హార్దిక్‌పై ఆకాష్ చోప్రా ఫైర్!
Hardik Pandya Trolls: ప్రస్తుతం ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. జట్టు ప్రదర్శనతో పాటు కెప్టెన్ హార్దిక్ ఫామ్ కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది.
Hardik Pandya Trolls: మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఎప్పుడు ఆడావో గుర్తుందా.. హార్దిక్‌పై ఆకాష్ చోప్రా ఫైర్!
Hardik Pandya Trolls: ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఒకప్పుడు వరుస విజయాలు అందుకున్న ముంబై.. ఇప్పుడు అదే విజయాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం మాత్రమే సాధించిన హార్దిక్ సేన.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. జట్టు ప్రదర్శనతో పాటు కెప్టెన్ హార్దిక్ ఫామ్ కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది.
ఐపీఎల్ 2026లో హార్దిక్ పాండ్య ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం 81 పరుగులు మాత్రమే చేశాడు. అతడి స్ట్రైక్‌రేట్ 158 మాత్రమే. ఇక బౌలింగ్‌లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 12 ఓవర్లు వేసిన హార్దిక్ 134 పరుగులు ఇచ్చి కేవలం రెండు వికెట్స్ మాత్రమే పడగొట్టాడు.
కెప్టెన్సీ విషయంలో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ స్థాయి పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను సరిగా వినియోగించలేకపోతున్నాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మైదానంలో నిత్యం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కనిపిస్తున్నాడు.
ఈ నేపధ్యంలో హార్దిక్ పాండ్యపై టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా ఫైర్ అయ్యాడు. మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఇప్పుడాడావో గుర్తుందా? అంటూ సెటైర్లు వేశాడు. 'హార్దిక్ ఒక్కడివే మ్యాచ్‌ను గెలిపించిన ఇన్నింగ్స్ ఎప్పుడు ఆడావో గుర్తు లేదు. కనీసం నీకైనా గుర్తుందా?. చిన్న చిన్న ఇన్నింగ్స్‌లు ఉన్నాయి కానీ 70-80 పరుగులు చేసి జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడి ఎంతో కాలమైంది.
హార్దిక్‌లో ఆ సామర్థ్యం ఉంది. మైదానంలో నిరూపించుకోవాల్సిన సమయం ఇదే' అంటూ ఆకాష్ సూచించాడు. ముంబై జట్టుకు కొత్త ఆలోచనలు అవసరమని అభిప్రాయపడ్డాడు. మిడిల్ ఆర్డర్ సమస్యలను అధిగమించడానికి షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ ను ముందుకు పంపాలని సూచించాడు. జట్టులో కొంత కొత్తదనం, ధైర్యంగా ఆడే ధోరణి అవసరమని ఆకాష్ చెప్పాడు.
వరుసగా ఓటములు ఎదురైనప్పుడు మైదానంలో సంయమనం పాటించడం కెప్టెన్‌కు ఉండాల్సిన మొదటి లక్షణం. హార్దిక్ పాండ్య సహచరుల విషయంలో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు కాస్త లౌక్యం ప్రదర్శించాల్సిన అవసరం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పునరాగమనానికి హార్దిక్ ప్రదర్శన కీలకంగా మారింది. కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్‌గా తన ప్రతిభను నిరూపించుకోవాల్సిన సమయం ఇదే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈరోజు గుజరాత్ టైటాన్స్‌తో ముంబై మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ గెలవడం అత్యంత అవసరం.




