Abhishek Sharma: రోహిత్‌ను వెనక్కి నెట్టిన అభిషేక్ శర్మ.. ధోనికి ఎసరు పెట్టేశాడుగా
Abhishek Sharma: అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్‌తో వార్తల్లో నిలిచారు. హైదరాబాద్ తరఫున ఈ యంగ్ ప్లేయర్ పంజాబ్‌పై జరిగిన మ్యాచ్‌లో తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు రాబట్టి సరికొత్త రికార్డును సృష్టించాడు.
Abhishek Sharma
Abhishek Sharma: అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్‌తో వార్తల్లో నిలిచారు. హైదరాబాద్ తరఫున ఈ యంగ్ ప్లేయర్ పంజాబ్‌పై జరిగిన మ్యాచ్‌లో తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు రాబట్టి సరికొత్త రికార్డును సృష్టించాడు.
ఒకే ఓవర్‌లో విధ్వంసం.. రోహిత్‌ను దాటేసిన అభిషేక్
ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ సాధించిన మరో ఘనత ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్‌లో 20కి పైగా పరుగులు అత్యధిక సార్లు సాధించిన భారతీయ బ్యాటర్ల జాబితాలో అతడు అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ధోని పేరిట ఉంది. ధోనీ 10 సార్లు ఈ ఫీట్ నమోదు చేయగా, ఇప్పుడు అభిషేక్ కూడా అదే సంఖ్యను అందుకున్నాడు. దీంతో 9 సార్లు ఈ ఘనత సాధించిన రోహిత్ శర్మను మూడో స్థానానికి వెళ్లిపోయాడు.
హైదరాబాద్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే అభిషేక్ దూకుడు కనబరిచాడు. ముఖ్యంగా మార్కో వేసిన ఓవర్‌లో చెలరేగాడు. మొదట ట్రావిస్ హెడ్ సింగిల్ తీసిన తర్వాత స్ట్రైక్‌లోకి వచ్చిన అభిషేక్ వరుస బౌండరీలు, సిక్సర్లతో బౌలర్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ ఓవర్‌లో మొత్తం 21 పరుగులు రావడం మ్యాచ్ మోమెంటమ్‌ను పూర్తిగా హైదరాబాద్ వైపు తిప్పింది. అదే సమయంలో రోహిత్ శర్మ రికార్డును కూడా అధిగమించాడు.
భారీ స్కోరుతో టేబుల్ టాపర్‌గా సన్‌రైజర్స్
అభిషేక్ శర్మ ఇచ్చిన మెరుపు ఆరంభాన్ని హేన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ అద్భుతంగా కొనసాగించారు. క్లాసెన్ 69 పరుగులు, ఇషాన్ కిషన్ 55 పరుగులతో రాణించడంతో హైదరాబాద్ 235 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. లక్ష్య ఛేదనలో పంజాబ్ తరఫున కూపర్ కానల్లీ సెంచరీతో పోరాడినా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. చివరకు పంజాబ్ 202 పరుగుల వద్ద ఆగిపోయింది. బౌలింగ్‌లో కమ్మిన్స్, శివమ్ కుమార్ తలా రెండు వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.




