Abhishek Sharma: అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ఇలా అయితే కాటేరమ్మ కొడుక్కి కష్టమే!
Abhishek Sharma registers unwanted Record: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ఆటగాడిగా నిలిచాడు.
Abhishek Sharma: అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ఇలా అయితే కాటేరమ్మ కొడుక్కి కష్టమే!
Abhishek Sharma registers unwanted Record: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ డకౌట్ అవ్వడంతో ఈ రికార్డు అతడి ఖాతాలో చేరింది. ఎల్ఎస్‌జీపై అభిషేక్ రెండు బంతుల్లోనే డక్‌గా వెనుదిరిగాడు. మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఔట్ కావడంతో.. ఈ క్యాలెండర్ ఇయర్‌లో ఆరో డక్‌గా నమోదైంది.
ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక డక్స్ నమోదు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ, సంజు శాంసన్ ఉన్నారు. రోహిత్ 2018లో, సంజు 2024లో ఆరు డక్స్ నమోదు చేశారు. తాజాగా ఈ ఇద్దరు సరసన అభిషేక్ శర్మ చేరాడు. ఐపీఎల్ 2026లో అభిషేక్ ప్రదర్శన పేలవంగా ఉంది. ఇప్పటివరకు మూడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 48 పరుగులు కోల్‌కతా నైట్ రైడర్స్‌పై వచ్చినవే కావడం విశేషం. మిగతా రెండు మ్యాచ్‌లలో అభిషేక్ పూర్తిగా విఫలమయ్యాడు. ఓపెనర్‌గా జట్టుకు బలమైన ఆరంభం ఇవ్వాల్సిన సమయంలో అభిషేక్ వరుస వైఫల్యాలు ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి.
అంతర్జాతీయ స్థాయిలో కూడా అభిషేక్ శర్మకు ఈ ఏడాది కలిసి రావడం లేదు. టీ20 ప్రపంచకప్ 2026లో 8 ఇన్నింగ్స్‌ల్లో 141 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. టోర్నీ ఆరంభంలో వరుసగా మూడు డక్స్ నమోదవడం అతని ఫామ్‌పై ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఫైనల్లో ఒక అర్ధ శతకంతో మెరిశాడు. మెగా టోర్నీలో మొత్తంగా చూస్తే.. అతడి ప్రదర్శన మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. 2026లో ఇప్పటివరకు మొత్తం 16 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 378 పరుగులు మాత్రమే చేశాడు. అతడి సగటు 25.20 కాగా.. స్ట్రైక్ రేట్ 195కు పైగా ఉంది. అయితే నిలకడ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అభిషేక్ ఖాతాలో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నప్పటికీ.. కీలక మ్యాచ్‌ల్లో విఫలమవడం జట్టుపై ప్రభావం పడుతోంది. ఇలానే కొనసాగితే కాటేరమ్మ కొడుక్కి జట్టులో చోటు కష్టమే అవుతుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎల్ఎస్‌జీ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ సారథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్ హర్షల్ పటేల్, లియామ్ లివింగ్‌స్టోన్‌లను జట్టులోకి తీసుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. క్లాసెన్ (62), నితీశ్ రెడ్డి (56) హాఫ్ సెంచరీలు బాదారు. ఛేదనలో లక్నో మరో బంతి ఉండగానే విజయాన్ని అందుకుంది. రిషభ్ పంత్ (68 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.




