Abhishek Sharma: అభిషేక్ శర్మ ఖాతాలో అత్యంత చెత్త రికార్డ్.. టీ20 హిస్టరీలోనే..!
Abhishek Sharma Golden Duck Records: జపాన్ (Japan) మ్యాచ్ ద్వారా టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
Abhishek Sharma: అభిషేక్ శర్మ ఖాతాలో అత్యంత చెత్త రికార్డ్.. టీ20 హిస్టరీలోనే..!
Abhishek Sharma Golden Duck Records: సనో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ (Sano International Cricket Ground) వేదికగా భారత్, జపాన్ జట్ల సమరం వర్షం ప్రభావంతో ఐదు ఓవర్ల మ్యాచ్‌గా సాగింది. టాస్ నెగ్గిన భారత జట్టు (Team India) మొదట బ్యాటింగ్ చేపట్టింది. ఇన్నింగ్స్ ఆరంభించేందుకు క్రీజులోకి వచ్చిన ఓపెనర్ అభిషేక్ శర్మ తనపై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయాడు. జపాన్ బౌలర్ చార్లీ హారా హింజే (Charlie Hara Hinze) వేసిన మొదటి బంతికే వికెట్ సమర్పించుకున్నాడు. కనీసం ఖాతా తెరవకుండానే గోల్డెన్ డక్ (Golden Duck) రూపంలో వెనుదిరిగి అందరినీ తీవ్ర నిరాశకు గురిచేశాడు. ఈ వైఫల్యం ఒక అవాంఛిత రికార్డుకు దారితీసింది. అతను త్వరగా పెవిలియన్ చేరినా, భారత జట్టు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో జపాన్‌పై రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది.
అంతర్జాతీయ టీ20 (T20I) ఫార్మాట్‌లో 2026 క్యాలెండర్ ఇయర్ లో అభిషేక్ శర్మ ఖాతాలో ఇది ఐదో గోల్డెన్ డక్. ఒక్క సంవత్సరంలో అత్యధిక సార్లు ఎదుర్కొన్న మొదటి బంతికే డకౌటైన బ్యాటర్ల జాబితాలో నిలిచాడు. రవాండా ప్లేయర్ కెవిన్ ఇరాకోసే (Kevin Irakoze), జింబాబ్వే పేసర్ రిచర్డ్ నగారవ (Richard Ngarava) సాధించిన ఐదు గోల్డెన్ డక్స్ చెత్త రికార్డును సమం చేశాడు.
ఈ ఏడాది అంతర్జాతీయ పొట్టి క్రికెట్ లో అభిషేక్ జీరోకే ఔటవడం ఏడోసారి కావడం గమనార్హం. ఒకే ఏడాదిలో అత్యధిక సార్లు సున్నా పరుగులకు వెనుదిరిగిన అప్రతిష్టను సైతం పంచుకున్నాడు.
అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు మొత్తం ఓవరాల్ టీ20 (T20 Cricket) రికార్డులను పరిశీలిస్తే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. 2026 సీజన్ లో ఇప్పటివరకు అభిషేక్ మొత్తం 10 సార్లు ఖాతా తెరవకుండా ఔటయ్యాడు. ఒకే ఏడాదిలో రెండంకెల సంఖ్యలో డకౌట్లు నమోదు చేసిన ఏకైక ఆటగాడిగా చెత్త చరిత్రకెక్కాడు. గతంలో రషీద్ ఖాన్ (Rashid Khan), షాదాబ్ ఖాన్ (Shadab Khan) చెరో 9 సార్లు సున్నాకే పెవిలియన్ చేరి అగ్రస్థానంలో నిలవగా, ఆ రికార్డును అభిషేక్ అధిగమించాడు.




