Abhishek Sharma Record: అభిషేక్‌ శర్మ అరుదైన మైలురాయి.. ఇక డేవిడ్ వార్నర్ టార్గెట్!

Abhishek Sharma SRH Record: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్) యువ ఓపెనర్ అభిషేక్‌ శర్మ అరుదైన మైలురాయి అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తరఫున 100 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు.

Rishvik
Published on: 2 April 2026 10:27 PM IST
Abhishek Sharma Reaches 100 Sixes for SRH, Eyes David Warner’s All-Time IPL Record
X

Abhishek Sharma

Abhishek Sharma SRH Record: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్) యువ ఓపెనర్ అభిషేక్‌ శర్మ అరుదైన మైలురాయి అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తరఫున 100 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. అంతేకాదు ఎస్‌ఆర్‌హెచ్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు (ఏప్రిల్ 2) ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో 4 సిక్సులు బాదడంతో అభిషేక్‌ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 48 రన్స్ చేసి తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.

ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో ఉన్నాడు. వార్నర్ 143 సిక్సర్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. వార్నర్ తర్వాత యువ స్టార్ అభిషేక్‌ శర్మ 101 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అభిషేక్‌ యాక్టివ్ ప్లేయర్ కావడంతో.. ఈ రికార్డును త్వరలోనే బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయి. అభిషేక్‌ సునాయాసంగా సిక్సులు బాదేస్తుంటాడు కాబట్టి.. ఐపీఎల్ 2027 పూర్తయ్యే లోపు కచ్చితంగా వార్నర్ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మూడో స్థానంలో దక్షిణాఫ్రికా వికెట్‌కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌ 89 సిక్సర్లతో నిలిచాడు. క్లాసెన్ తన పవర్ హిట్టింగ్‌తో ఇటీవల సీజన్లలో ఎస్ఆర్‌హెచ్‌కు కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఐపీఎల్ 2026లో క్లాసెన్‌ 100 సిక్సుల మైలురాయిని అందుకునే అవకాశాలు ఉన్నాయి. నాలుగో స్థానంలో న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ 64 సిక్సర్లతో ఉన్నాడు. నిలకడైన బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందిన విలియమ్సన్ కూడా అవసరమైనప్పుడు భారీ షాట్లు ఆడుతూ జట్టుకు సహాయపడ్డాడు. ఐదో స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ 50 సిక్సర్లతో ఉన్నాడు. తక్కువ మ్యాచ్‌ల్లోనే ఈ స్థాయికి చేరుకోవడం హెడ్ దూకుడు ఆటకు నిదర్శనం. మొత్తంగా చూస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో పవర్ హిట్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, క్లాసెన్, ట్రావిస్ హెడ్ లాంటి ఆటగాళ్లు రాబోయే మ్యాచ్‌ల్లో ఈ రికార్డులను మరింత మెరుగుపరచే అవకాశం ఉంది.

ఎస్‌ఆర్‌హెచ్ తరఫున అత్యధిక సిక్సర్లు:

డేవిడ్ వార్నర్ - 143

అభిషేక్ శర్మ - 101*

హెన్రిచ్ క్లాసెన్ - 89 *

కేన్ విలియమ్సన్ - 64

ట్రావిస్ హెడ్ - 50 *

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story