Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు ఖాతాలో చెత్త రికార్డు.. ఇలా అయితే కష్టమే!
Abhishek Sharma: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు ఖాతాలో చెత్త రికార్డు.. ఇలా అయితే కష్టమే!
Abhishek Sharma: సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్, కాటేరమ్మ కొడుకు అభిషేక్ శర్మ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టీ20లలో ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక డక్‌లు అయిన ఇండియన్ బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అవడంతో ఈ చెత్త రికార్డు అభిషేక్ ఖాతాలో చేరింది. ఈ క్యాలెండర్ ఇయర్‌లో అభిషేక్ ఏడు సార్లు డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్స్ రోహిత్ శర్మ, సంజు శాంసన్ రికార్డును బ్రేక్ చేశాడు.
ఇప్పటివరకు ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధికసార్లు డకౌటైన ఇండియన్ బ్యాటర్‌లుగా రోహిత్ శర్మ, సంజు శాంసన్ అగ్ర స్థానంలో ఉన్నారు. రోహిత్ 2018లో 32 ఇన్నింగ్స్‌లలో 6 సార్లు డకౌట్ కాగా.. సంజు 2024లో 32 ఇన్నింగ్స్‌లలో 6 సార్లు డకౌట్ అయ్యాడు. తాజాగా వీరిద్దరి రికార్డును అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు. 2026లో ఇప్పటివరకు 18 ఇన్నింగ్స్‌లు ఆడిన అభిషేక్.. మొత్తం 7 సార్లు డకౌట్ అయ్యాడు. కాటేరమ్మ కొడుకు దూకుడైన బ్యాటింగ్ శైలితో ప్రసిద్ధి గాంచినా.. అదే అటాకింగ్ మైండ్‌సెట్ కారణంగా త్వరగా అవుట్ అవుతున్నాడు. 2013లో గుర్కీరత్ సింగ్ మాన్ 19 ఇన్నింగ్స్‌లలో 5 సార్లు డక్ అయ్యి ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు.
టీ20 క్రికెట్‌లో బ్యాటర్లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అనూహ్యంగా డకౌట్ కూడా అవుతుంటారు. ఈ జాబితాలో ఉన్న రోహిత్ శర్మ, సంజు శాంసన్, అభిషేక్ శర్మలు సంచలన ఇన్నింగ్స్‌లు ఆడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదే సమయంలో చెత్త ప్రదర్శన కూడా చేశారు. అభిషేక్ ఇటీవలి కాలంలో డకౌట్స్ ఎక్కువగా అవుతున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026లో మూడుసార్లు డకౌట్ అయిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2026లో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున పెద్దగా రాణించడం లేదు. కాటేరమ్మ కొడుకు ఇప్పటికైనా ఫామ్ అందుకోవాలని.. లేదంటే జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం ఉందని నెటిజన్స్ అంటున్నారు.
ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధికసార్లు డక్స్:
7 - అభిషేక్ శర్మ (2026లో 18 ఇన్నింగ్స్)
6 - రోహిత్ శర్మ (2018లో 32 ఇన్నింగ్స్)
6 - సంజు సామ్సన్ (2024లో 32 ఇన్నింగ్స్)
5 - గుర్కీరత్ సింగ్ మాన్ (2013లో 19 ఇన్నింగ్స్)




