బెయిల్‌పై బయటకు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్.. ఐపీఎల్ 2027 కోసమేనా..?
IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఫ్రాంచైజీకి చెందిన యువ క్రికెటర్ అభిషేక్ పోరెల్ (Abishek Porel) కు కోల్‌కతా కోర్టులో ఊరట లభించింది.
బెయిల్‌పై బయటకు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్.. ఐపీఎల్ 2027 కోసమేనా..?
IPL 2027: అభిషేక్ పోరెల్ (Abishek Porel) జైలు జీవితానికి తెరపడింది. గతంలో ఆగస్టు 11వ తేదీన పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలోని హూగ్లీ జిల్లాలో ఈ యువ బ్యాటర్ అరెస్టయ్యాడు. పెళ్లి పేరుతో మోసం చేశాడనే ఆరోపణలతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
దాదాపు 36 రోజుల పాటు జైలులో గడిపిన తరువాత చుంచురా కోర్టు ఈ కేసుకు సంబంధించి బెయిల్ మంజూరు చేసినట్లు ఏబీపీ ఆనంద (ABP Ananda) నివేదిక వెల్లడించింది. అయితే జైలు నుంచి విడుదల కావడానికి ఆయన మరో రోజు వేచి చూడాల్సి వస్తోంది.
గతంలో ఆగస్టు 14వ తేదీన జరిగిన విచారణలో స్థానిక కోర




