Ajinkya Rahane: ఐపీఎల్‌లో అత్యంత చెత్త రికార్డు.. ఇక రహానే కెరీర్ క్లోజ్?
Ajinkya Rahane: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే అత్యంత చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.
Ajinkya Rahane: ఐపీఎల్‌లో అత్యంత చెత్త రికార్డు.. ఇక రహానే కెరీర్ క్లోజ్?
Ajinkya Rahane: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్ అజింక్య రహానే అత్యంత చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు డకౌట్ అయిన ఓపెనర్‌గా రహానే రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)తో జరిగిన మ్యాచ్‌లో రహానే పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. నండ్రే బర్గర్ వేసిన రెండో ఓవర్ రెండో బంతికి కీపర్ ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దాంతో 12వ సారి ఐపీఎల్‌లో ఓపెనర్‌గా జింక్స్ డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్ ముందు వరకు టీమిండియా మాజీ కీపర్ పార్థివ్ పటేల్‌తో సమానంగా ఉన్న రహానే.. ఇప్పుడు చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్‌లో ఓపెనర్‌గా పార్థివ్ పటేల్ 11 సార్లు డకౌట్ అయ్యాడు. భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్, మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఇద్దరూ 10 సార్లు డక్ అయి ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. ఈ ఇద్దరూ ఐపీఎల్‌లో తమ జట్లకు ఎన్నో విజయాలు సాధించినప్పటికీ.. ఈ రికార్డులో కూడా చోటు దక్కడం విశేషం. ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. వార్నర్ 9 సార్లు డక్ అయి ఐదో స్థానంలో నిలిచాడు. దేవ్ భాయ్ ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఓపెనర్లలో ఒకడైనా.. ఈ రికార్డు అతని కెరీర్‌లో మచ్చగా నిలిచింది.
కేకేఆర్ ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ అయ్యారు. అజింక్య రహానేతో పాటు టీమ్ సీఫెర్ట్ కూడా డకౌట్ అయ్యాడు. ఓ మ్యాచులో కేకేఆర్ ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ అవ్వడం ఇది రెండోసారి. 2014లో ఢిల్లీ డేర్ డెవిల్స్ (ఇప్పటి ఢిల్లీ క్యాపిటల్స్)పై గౌతమ్ గంభీర్, జాక్ కల్లిస్ డకౌట్ అయ్యారు. ఇక ఐపీఎల్ 2026లో రహానే వరుసగా విఫలమవుతున్నాడు. కోల్‌కతా తరఫున ఇప్పటివరకు 7 మ్యాచులు ఆడి 152 పరుగులు మాత్రమే చేశాడు.
అతడి సగటు 25.33గా ఉండగా.. స్ట్రైక్ రేట్ 144.8గా ఉంది. ఈ సీజన్లో రహానే అత్యధిక స్కోరు 67. ఒక మ్యాచ్ తప్ప.. మిగతా వాటిల్లో విఫలమయ్యాడు. ఐపీఎల్ 2026లో కేకేఆర్ ఇప్పటివరకు ఒక విజయం అందుకోలేదు. అటు సారథ్యంలో, ఇటు బ్యాటింగ్లో విఫలమవుతుండడంతో వచ్చే సీజన్లో అతడు ఆడడం కష్టమనే చెప్పాలి. 2026 సీజన్ కోసం రహానేను కోల్‌కతా రూ.1.50 కోట్లకు కొనుగోలు చేసింది.
ఐపీఎల్ 2026లో రహానే స్కోర్లు:
67 (40) vs MI
8 (10) vs SRH
8* (6) vs PBKS
41 (24) vs LSG
28 (22) vs CSK
0 (1) vs GT
0 (2) vs RR
ఐపీఎల్‌లో మోస్ట్ డకౌట్‌లు:
12 - అజింక్య రహానే*
11 - పార్థివ్ పటేల్
10 - శిఖర్ ధావన్
10 - గౌతమ్ గంభీర్
9 - డేవిడ్ వార్నర్




