IPL 2026: ఐపీఎల్ హిస్టరీలోనే ఏకైక బౌలర్.. ఈ ప్రపంచ రికార్డ్ బ్రేక్ చేయడం కష్టమే..?
Amit Mishra, IPL Records: ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో, క్రికెట్ అభిమానులు ఒక దిగ్గజ బౌలర్‌ను ఎంతగానో మిస్ అవుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో మూడుసార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా అమిత్ మిశ్రా నిలిచాడు.
Amit Mishra
Amit Mishra, IPL Records: ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో, క్రికెట్ అభిమానులు ఒక దిగ్గజ బౌలర్‌ను ఎంతగానో మిస్ అవుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో మూడుసార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా అమిత్ మిశ్రా నిలిచాడు. పరుగుల వరద పారే ఈ లీగ్‌లో వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీయడం అంటే సామాన్యమైన విషయం కాదు.
భారత లెగ్ స్పిన్ దిగ్గజం అమిత్ మిశ్రా ఐపీఎల్ వేదికపై సృష్టించిన ఈ రికార్డును చెరిపివేయడం దాదాపు అసాధ్యం. బ్యాటర్లు మొదటి బంతి నుంచే భారీ సిక్సర్లు బాదే ఈ పొట్టి ఫార్మాట్లో, మిశ్రా తన మాయాజాలంతో మూడు వేర్వేరు సీజన్లలో హ్యాట్రిక్‌లు నమోదు చేయడం గమనార్హం.
మొదటిసారిగా 2008లో ఢిల్లీ జట్టు తరపున ఆడుతూ డెక్కన్ చార్జర్స్‌పై ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత 2011లో డెక్కన్ చార్జర్స్ జట్టులో ఉంటూ పంజాబ్ జట్టుపై రెండో హ్యాట్రిక్ తీశాడు. ఇక 2013లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతూ పూణే వారియర్స్‌పై మూడవ హ్యాట్రిక్ నమోదు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. గూగ్లీలు, లెగ్ స్పిన్ బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో మిశ్రా దిట్ట.
ఐపీఎల్ ప్రయాణం, గణాంకాలు..
2008 నుంచి 2024 వరకు ఐపీఎల్లో కొనసాగిన అమిత్ మిశ్రా, మొత్తం 162 మ్యాచ్‌లలో 174 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ, హైదరాబాద్, లక్నో వంటి అగ్రశ్రేణి జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఆయన, అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకరిగా నిలిచాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో కూడా స్పిన్ బౌలింగ్‌తో వికెట్లు తీయగల సామర్థ్యం ఆయన సొంతం.
అంతర్జాతీయ వేదికపై మెరుపులు..
భారత జట్టు తరపున 2003లో అరంగేట్రం చేసిన మిశ్రా, టెస్టుల్లో 76 వికెట్లు, వన్డేల్లో 64 వికెట్లు, టీ20ల్లో 16 వికెట్లు సాధించాడు. సుమారు 14 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో చురుగ్గా ఉంటూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
తొలి హ్యాట్రిక్ ఎవరిదంటే?
ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటి హ్యాట్రిక్ తీసిన ఘనత లక్ష్మీపతి బాలాజీకి దక్కుతుంది. 2008 తొలి సీజన్లోనే చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతూ పంజాబ్ జట్టుపై ఆయన ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్‌లో బాలాజీ కేవలం 24 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయడం విశేషం.




