Cricket: 6 బంతుల్లో 30 పరుగులు.. వీడెవడో డివిలియర్స్ తమ్ముడిలా ఉన్నాడు.! బౌలర్లను చితక్కొట్టుడే..!
Cricket: హాంకాంగ్ సిక్సెస్‌లో అన్షుమన్ 10 బంతుల్లో 50, ఇంగ్లండ్‌పై హాంకాంగ్& చైనా విజయం, భారత్‌పై పాక్ గెలుపు సంబంధించి కీలక విషయాలు ఇవిగో.!
Cricket: 6 బంతుల్లో 30 పరుగులు.. వీడెవడో డివిలియర్స్ తమ్ముడిలా ఉన్నాడు.! బౌలర్లను చితక్కొట్టుడే..!
Cricket: హాంకాంగ్ సిక్సర్ల టోర్నీ ఇవాళ ప్రారంభమైంది. తొలి రోజే అన్షుమన్ విధ్వంసంతో ఈ టోర్నీ హెడ్‌లైన్స్‌లోకి వచ్చింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు 10 బంతుల్లోనే 50 రన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్‌లో హాంకాంగ్&చైనా టీమ్ 6 ఓవర్లలో 149/5 స్కోర్ చేసింది. అన్షుమన్ ఓవరాల్‌గా 13 బంతుల్లోనే 62 రన్స్‌తో చెలరేగాడు. బాబర్ హయత్ 15 బంతుల్లో 53 రన్స్ చేయగా, నిజాకత్ 8 బంతుల్లో 30 రన్స్‌తో అదరగొట్టాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో బ్యాటర్లు వరుసగా 6, 6, 4, 6, 4, 6 బాదేశారు. ఈ ఇన్నింగ్స్‌పై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్ చేస్తున్నారు. అటు ఛేజింగ్‌లో ఇంగ్లండ్ 88/3 స్కోరుకే పరిమితమై, 61 రన్స్ తేడాతో ఓడిపోయింది.
ఇదే టోర్నీలో జరిగిన గ్రూప్ C మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. కృనాల్ పాండ్యా కెప్టెన్సీలోని భారత్ 6 ఓవర్లలో 88/5 స్కోర్ చేసింది. శశాంక్ సింగ్ 11 బంతుల్లో 40 రన్స్‌తో చెలరేగాడు. రాహుల్ త్రిపాఠి 9, నితీష్ రాణా 19 రన్స్ చేశారు. కెప్టెన్ కృనాల్‌తో పాటు రాహుల్ తెవాటియా కూడా రాణించలేకపోయారు. ఈ రోజు టోర్నీలో నమోదైన అత్యల్ప స్కోరు ఇదే.
ఛేజింగ్‌లో పాక్ కెప్టెన్ అబ్బాస్ అఫ్రిది మొదటి ఓవర్‌లోనే కృనాల్ బౌలింగ్‌లో 5 సిక్సర్లు బాదాడు. ఈ ఓవరే మ్యాచ్‌ను భారత్ చేతుల్లోంచి లాగేసింది. ఖవాజా నఫే 12 బంతుల్లో 41 రన్స్ చేశాడు. అందులో 2 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అబ్దుల్ సమద్ 3 బంతుల్లో 7 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచి పాక్‌కు విజయాన్ని అందించాడు.




