Anushka Sharma: అనుష్క శర్మ పెట్టుకున్న వాచ్‌తో హైదరాబాద్‌లో ఇల్లు కొనేయొచ్చు..!
Anushka Sharma: ఐపీఎల్ స్టేడియంలో అనుష్క శర్మ తన స్టైలిష్ ఉనికితో అందరినీ ఆకట్టుకుంది.
Anushka Sharma
Anushka Sharma Fashion: ఐపీఎల్ అంటేనే కేవలం సిక్సర్లు, ఫోర్ల హోరు మాత్రమే కాదు.. స్టేడియంలో సందడి చేసే సెలబ్రిటీల గ్లామర్ కూడా. ముఖ్యంగా ఆర్‌సీబీ మ్యాచ్ ఉందంటే చాలు, విరాట్ కోహ్లీని ఉత్సాహపరిచేందుకు వచ్చే అనుష్క శర్మ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. తాజాగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించగా, గ్యాలరీలో అనుష్క శర్మ తన స్టైలిష్ ఉనికితో మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
సాధారణంగా అనిపించే అసాధారణ లుక్
అనుష్క శర్మ ఫ్యాషన్ ఎప్పుడూ ఒక సూత్రాన్ని నమ్ముకుంటుంది.. అదే సింప్లిసిటీ విత్ లగ్జరీ. ఈ మ్యాచ్ కోసం ఆమె ఎంచుకున్న వైట్ రంగు రఫుల్ స్లీవ్ టాప్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. సెజానే బ్రాండ్‌కు చెందిన ఈ టాప్ మీద ఉన్న ఎంబ్రాయిడరీ, లేస్ వర్క్ ఆమెకు ఎంతో హుందాతనాన్ని ఇచ్చా యి. దీని ధర సుమారు 17 వేల రూపాయలు. దీనికి జతగా ఆమె నీలిరంగు డెనిమ్ జీన్స్ ధరించి చాలా క్యాజువల్‌గా, కంఫర్టబుల్‌గా కనిపించింది. తక్కువ ధరలో ఉంటూనే ఇంతటి రిచ్ లుక్ ఇవ్వడం అనుష్కకే సాధ్యమని ఫ్యాషన్ ప్రియులు చర్చించుకుంటున్నారు.
కోటి రూపాయల వాచ్
అనుష్క ధరించిన టాప్ సాధారణంగా ఉన్నప్పటికీ, ఆమె చేతికి ఉన్న వాచ్ చూస్తే మాత్రం ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ బ్రాండ్ 'కార్టియర్'కు చెందిన పాంథెర్ డి కార్టియర్ వాచ్‌ను ఆమె ధరించింది. 18 క్యారెట్ల పసుపు బంగారంతో తయారైన ఈ వాచ్, 1980ల నాటి క్లాసిక్ డిజైన్‌ను గుర్తుకు తెస్తుంది. ఇందులో నీలిరంగు నీలమణి పొదిగి ఉంది. దీని ప్రారంభ ధరే సుమారు 28 లక్షల రూపాయలు. వజ్రాల పొందికను బట్టి ఇది 61 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అంటే.. తను వేసుకున్న 17 వేల రూపాయల టాప్‌కు, దాదాపు 60 లక్షల విలువైన వాచ్‌ను జత చేసి అనుష్క తన ఫ్యాషన్ నైపుణ్యాన్ని చాటుకుంది.
నేచురల్ బ్యూటీ.. ఎవర్ గ్రీన్ స్టైల్
భారీ మేకప్ లేకుండా, కేవలం నూడ్ పింక్ లిప్‌స్టిక్, సహజ సిద్ధమైన ఐ షాడో, సైడ్ పార్టెడ్ హెయిర్ స్టైల్‌తో ఆమె ఎంతో ప్రశాంతంగా కనిపించింది. స్టేడియంలో గందరగోళం ఉన్నా, తన కూల్ లుక్‌తో ఫ్యాషన్ ఐకాన్ అని మరోసారి నిరూపించుకుంది. భర్త విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేస్తూనే, తన స్టైలిష్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను అలరించింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం ఎంతటి ఆనందాన్ని ఇచ్చిందో, అనుష్క శర్మ ఫ్యాషన్ స్టేట్‌మెంట్ కూడా అంతే స్థాయిలో వైరల్ అవుతోంది.




