Arshdeep Singh: సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న అర్షదీప్ సింగ్ . కాబోయే భార్య ఎవరో తెలుసా..?

Arshdeep Singh: టీమిండియా స్టార్ పేసర్ అర్షదీప్ సింగ్, నటి సమ్రీన్ కౌర్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు.

Gagan kumar
Published on: 12 Nov 2026 10:19 AM IST
Arshdeep Singh
X

Arshdeep Singh: సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న అర్షదీప్ సింగ్ . కాబోయే భార్య ఎవరో తెలుసా..? 

Arshdeep Singh engagement: క్రికెట్ మైదానంలో యార్కర్లతో బ్యాటర్లను క్లీన్ బౌల్డ్ చేసే టీమిండియా స్టార్ పేసర్ అర్షదీప్ సింగ్, వ్యక్తిగత జీవితంలో ఓ అందమైన ప్రేమ బంధానికి బౌల్డ్ అయ్యారు.తన ప్రేయసి, నటి సమ్రీన్ కౌర్‌తో కలిసి ఏడడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు. బుధవారం న్యూజిలాండ్‌లోని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ జంట అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకుంది.

ప్రకృతి ఒడిలో జరిగిన ఈ వేడుకలో సమ్రీన్ వేలికి అర్షదీప్ ఉంగరం తొడిగి, తమ ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లే తొలి అడుగు వేశారు. ఇందుకు సంబంధించిన మధుర క్షణాలను ఈ జంట తమ సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకోగా, అవి క్షణాల్లోనే నెట్టింట వైరల్‌గా మారాయి. సంప్రదాయబద్ధంగా, ఎంతో అందంగా మెరిసిపోతున్న ఈ జంట ఫొటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

నిశ్చితార్థపు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సమ్రీన్ కౌర్, తన మనసులోని మాటలను ఎంతో అందంగా పంచుకున్నారు. జీవితం మాకు ఎన్నో అద్భుతమైన విషయాలను ఇచ్చింది. కానీ, వాటన్నింటికంటే ఒకరికొకరం దొరకడమే నాకు అత్యంత ఆనందాన్ని ఇచ్చింది. జీవితాంతం ఇలాగే కలిసి సాగుదాం. 11.11.2026.. హాయ్ కాబోయే భర్తగారు అంటూ అర్షదీప్‌పై తనకున్న ప్రేమను వ్యక్తం చేశారు.

మైదానంలో ఎప్పుడూ చిరునవ్వుతో, ఉత్సాహంగా కనిపించే అర్షదీప్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుండటంతో క్రికెట్ అభిమానులు, సమ్రీన్ ఫాలోవర్లు సంబరాలు చేసుకుంటున్నారు. 11.11 వంటి ప్రత్యేక తేదీన ఒక్కటైన ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సహచర క్రికెటర్లు, సినీ ప్రముఖులు సైతం ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే వీరి వివాహ తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.