Mumbai Indians: కెప్టెన్‌గా రోహిత్.. కట్ చేస్తే.. అర్ష్‌దీప్ రాకతో బలంగా ముంబై లైనప్.!

Mumbai Indians: ఐపీఎల్‌లో అర్ష్‌దీప్ సింగ్ ముంబై ఇండియన్స్ జట్టులోకి రావడంతో ఆ జట్టు బౌలింగ్ విభాగం మరింత బలంగా మారనుంది.

Ravi
By Ravi
Published on: 10 Nov 2026 8:44 PM IST
Mumbai Indians
X

Mumbai Indians: కెప్టెన్‌గా రోహిత్.. కట్ చేస్తే.. అర్ష్‌దీప్ రాకతో బలంగా ముంబై లైనప్.!

Mumbai Indians: ఐపీఎల్‌లో సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముంబై ఇండియన్స్ జట్టులోకి స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ రాకతో ఆ జట్టు బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారనుందని ఎక్స్‌పర్ట్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఆ జట్టులో యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ లాంటి ప్రసిద్ధ స్వింగ్ మాస్టర్లు అందుబాటులో ఉన్నారు. అర్ష్‌దీప్ సింగ్ జట్టుతో కలవడం ద్వారా ముంబై పేస్ అటాక్ మరింత పదును తేలనుంది. ముఖ్యంగా అర్ష్‌దీప్ మ్యాచ్ ప్రారంభ ఓవర్లలోనే వికెట్లు తీయడంలో తన ప్రత్యేకతను చాటుకుంటుండగా, జస్ప్రీత్ బుమ్రా తన కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు ఎప్పుడూ ముప్పతిప్పలు పెడుతుంటాడు. ఈ ఇద్దరు కలిసి ప్రత్యది జట్లకు తీవ్ర ఇబ్బందులు సృష్టించడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కేవలం పేస్ విభాగమే కాకుండా, స్పిన్ డిపార్ట్‌మెంట్‌లోనూ ముంబై జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. జట్టులో స్పిన్ విభాగాన్ని సాంట్నర్ లీడ్ చేయనున్నట్లు సమాచారం. అనుభవజ్ఞులైన స్పిన్నర్ల రాకతో పిచ్ పరిస్థితులకు తగినట్లుగా వ్యూహాలు రచించడానికి జట్టుకు తగినంత వెసులుబాటు లభిస్తుంది. బ్యాటింగ్ పరంగా కూడా ముంబై లైనప్ అత్యంత పటిష్టంగా ఉంది.

జట్టులో స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మరియు రూథర్‌ఫర్డ్ లాంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉండటంతో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. ఏ క్షణమైనా మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల సత్తా ఉన్న ఈ ఆటగాళ్లందరితో ముంబై జట్టు రాబోయే సీజన్‌కు సర్వసన్నద్ధమవుతోంది. అటు కెప్టెన్‌గా రోహిత్ శర్మ తిరిగి బాధ్యతలు చేపట్టనున్న వార్తల నేపధ్యంలో ముంబై బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కోవడం కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.