Ashleigh Gardner: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో సంచలనం.. భార్య ఉండగానే సహచర క్రికెటర్‌తో స్టార్ ప్లేయర్ అఫైర్!
Ashleigh Gardner faces affair allegations from ex-wife Monica Wright. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టును ఓ ప్లేయర్ వ్యక్తిగత వివాదం కుదిపేస్తోంది.
Ashleigh Gardner: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో సంచలనం.. భార్య ఉండగానే సహచర క్రికెటర్‌తో స్టార్ ప్లేయర్ అఫైర్!
Ashleigh Gardner: 20 ప్రపంచ కప్ 2026 విజయం సాధించిన ఆనందంలో ఉన్న ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టును ఓ ప్లేయర్ వ్యక్తిగత వివాదం కుదిపేస్తోంది. ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆష్లీ గార్డ్నర్‌పై ఆమె మాజీ భార్య మోనికా రైట్ తీవ్ర ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జట్టు సహచర క్రికెటర్ జార్జియా వోల్‌తో గార్డ్నర్‌కు అఫైర్ (వివాహేతర సంబంధం) ఉందని మోనికా బహిరంగంగా ఆరోపించింది. ఈ విషయాన్ని మోనికా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొంది.
ఆష్లీ గార్డ్నర్ తన భార్యను మోసం చేసి సహచర మహిళా క్రికెటర్‌తో సంబంధం పెట్టుకుందని, అందుకే వారి (గార్డ్నర్-మోనికా) దాంపత్య జీవితం సంక్షోభంలో పడినట్లు డైలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. అయితే ఆ కథనంలో సంబంధిత క్రికెటర్ పేరును మాత్రం వెల్లడించలేదు. దీనిపై స్పందించిన మోనికా రైట్.. సోషల్ మీడియాలో నేరుగా జార్జియా వోల్ ఫోటోను పంచుకుంటూ ఓ పోస్ట్ చేసింది. 'ఈమె నా కాపురంలో నిప్పులు పోసింది' అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసికొచ్చింది. మోనికా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్ కాగా.. ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ అయిన గార్డనర్.. మరో మహిళ మోనికా రైట్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ ఏడాది భారత్ వేదికగా జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్ సమయంలోనే ఆష్లీ గార్డ్నర్ వ్యక్తిత్వంలో మార్పు కనిపించిందని జట్టు సభ్యులు గమనించినట్లు తెలుస్తోంది. టోర్నీ మధ్యలో మోనికా భారత్‌కు వచ్చినప్పటికీ.. పరిస్థితులు అప్పటికే దిగజారినట్లు సమాచారం. ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిన అనంతరం తమ సంబంధంలో మార్పు వచ్చిందని గార్డ్నర్ తన భార్యకు చెప్పినట్లు, ఆ తర్వాత కొద్ది నెలల్లోనే ఇద్దరూ విడిపోయినట్లు డైలీ మెయిల్ కథనం పేర్కొంది. అంతకు కొన్ని రోజుల ముందే ఈ జంట పిల్లలు కందామని కూడా ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. అయితే గత ఏడాది నవంబర్‌లో గార్డ్నర్ సిడ్నీలోని తమ ఇంటిని విడిచిపెట్టి వెళ్లిపోయిందని, పెళ్లి ఉంగరాలను కూడా ఇంట్లోనే వదిలేసినట్లు సదరు నివేదిక వెల్లడించింది.
ఈ వ్యవహారం ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళల డ్రెస్సింగ్ రూమ్‌లోనూ చర్చనీయాంశంగా మారినట్లు సమాచారం. జట్టులోని కొందరు ఆటగాళ్లు ఇప్పటికీ మోనికా రైట్‌తో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు డైలీ మెయిల్ పేర్కొంది. ఈ ఆరోపణలపై క్రికెట్ ఆస్ట్రేలియాను అక్కడి మీడియా సంప్రదించగా.. సీఏ నిరాకరించింది. ఐదేళ్లు ప్రేమలో ఉన్న గార్డ్‌నర్, మోనికలు.. 2025 ఏప్రిల్‌లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఏడాది అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో వీరి పెళ్లి పెటాకులైంది.
ఆష్లీ గార్డ్నర్ ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళల జట్టులో కీలక ఆటగాళ్లలో ఒకరు. ఇటీవల ఆమె జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది. అంతేకాకుండా ఐసీసీ మహిళల వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా గెలుచుకుంది. అయితే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ ఆరోపణలపై గార్డ్నర్ లేదా జార్జియా వోల్ ఇప్పటివరకు స్పందించలేదు. ప్రస్తుతం ఈ వ్యవహారం క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చకు దారితీసింది.




