Ashleigh Gardner: సహచర క్రీడాకారిణితో వివాహేతర సంబంధం.. ఎట్టకేలకు స్పందించిన స్టార్ మహిళా క్రికెటర్!
Ashleigh Gardner On Affair Allegations. ఆష్లే గార్డనర్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వివాదాస్పద ఆరోపణలపై స్పందించింది.
Ashleigh Gardner: సహచర క్రీడాకారిణితో వివాహేతర సంబంధం.. ఎట్టకేలకు స్పందించిన స్టార్ మహిళా క్రికెటర్!
Ashleigh Gardner: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ ఆష్లే గార్డనర్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వివాదాస్పద ఆరోపణలపై తొలిసారి స్పందించింది. తన భార్య మోనికా రైట్‌తో విడిపోవడం పూర్తిగా వ్యక్తిగత విషయమని స్పష్టం చేసింది. మోనికాకు కలిగిన బాధకు తాను చింతిస్తున్నా అని, ఆమె భవిష్యత్తులో విజయం సాధించాలని కోరుకుంటున్నా అని తెలిపింది. ఈ అంశంపై ఇకపై బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని గార్డనర్ చెప్పింది. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆష్లే గార్డనర్, మోనికా రైట్ మధ్య విడిపోవడానికి కారణం వివాహేతర సంబంధం. సహచర క్రికెటర్ జార్జియా వోల్‌తో గార్డనర్‌కు వివాహేతర సంబంధం ఉందంటూ మోనికా ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ వ్యవహారంపై క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలు తీసుకోలేదని, గార్డనర్‌కు జట్టు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కొనసాగించడం సరికాదని ఆమె విమర్శించింది.
ఈ ఆరోపణల నేపథ్యంలో గార్డనర్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. 'నా భార్య మోనికా రైట్ నుంచి విడిపోవడం పూర్తిగా నా వ్యక్తిగత విషయం. వైస్ కెప్టెన్‌గా నా హోదాను దృష్టిలో ఉంచుకుని.. నా రిలేషన్‌షిప్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించాల్సిన అవసరం ఉంటుందనే విషయాన్ని నేను అర్థం చేసుకున్నా. ఈ సమయంలో బోర్డు నాకు మద్దతు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వచ్చే సీజన్‌లో బాగా ఆడేందుకు, నా సహచరులకు మద్దతు ఇవ్వడానికి ఎదురుచూస్తున్నాను' అని గార్డనర్ పేర్కొంది.
'మోనికా రైట్‌తో కలిసి నేను మంచి సమయం గడిపాను. అందుకు నేను కృతజ్ఞురాలిని. మోనికాకు కలిగిన బాధకు చింతిస్తున్నాను. భవిష్యత్తులో ఆమె సంతోషంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఈ అంశంపై ఇకపై ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయను. మా వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరుతున్నాను' అని ఇన్‌స్టా స్టోరీలో ఆష్లే గార్డనర్ రాసుకొచ్చారు. అంతకుముందు మోనికా రైట్.. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తులు నైతిక విలువలను పాటించాల్సిన బాధ్యత ఉందని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై క్రికెట్ ఆస్ట్రేలియా ఎందుకు బహిరంగంగా స్పందించలేదో తనకు అర్థం కావడం లేదని ప్రశ్నించింది.
అయితే క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం ఈ వ్యవహారం పూర్తిగా వ్యక్తిగతమైనదని పేర్కొంది. తమ బోర్డుని అన్ని సంబంధాలు ‘Respect at Work’ విధానానికి అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది. నాయకత్వ బాధ్యతలు, జట్టు ప్రక్రియల సమగ్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలను అమలు చేస్తామని స్పష్టం చేసింది. ఈ వివాదం నేపథ్యంలో ఆష్లే గార్డనర్ వైస్ కెప్టెన్సీపై కూడా చర్చ మొదలైనప్పటికీ.. క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు ఆమె నాయకత్వాన్ని కొనసాగించేందుకు మద్దతు తెలిపింది. ఇక ఈ అంశాన్ని బహిరంగ చర్చకు తీసుకెళ్లకుండా వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని గార్డనర్ కోరింది.




