Asia Boxing Champion: ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో దూసుకుపోతున్న భారత్ బాక్సర్లు

Asia Boxing Champion: ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ కు చెందిన 11 మంది బాక్సర్లు సెమీస్ కు దూసుకుపోయి . . పతకాలు ఖాయం చేసుకున్నారు

KVD Varma
Published on: 6 April 2026 2:59 PM IST
Asia Boxing Champion: ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ కు చెందిన 11 మంది బాక్సర్లు సెమీస్ కు
X

Asia Boxing Champion

Asia Boxing Champion: మంగోలియాలోని ఉలాన్‌బాతర్‌లో జరుగుతున్న ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తోంది. వీరి విజయాలతో కచ్చితంగా భారత్ కు 11 పతకాలు ఖాయం అయ్యాయి. ఐదుగురు మహిళా, ఆరుగురు పురుష బాక్సర్లు సెమీఫైనల్స్‌లో తమ స్థానాలను సురక్షితం చేసుకున్నారు. పురుషుల విభాగంలో లోకేష్, ఆకాష్, హర్ష్ చౌదరిల విజయాలతో, మొత్తం ఆరుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు.

మీనాక్షి, జాస్మిన్‌ల తిరుగులేని విజయాలు..

ఆదివారం ఉదయం జరిగిన సెషన్‌లో మీనాక్షి (48 కేజీలు), జాస్మిన్ (57 కేజీలు) అద్భుతంగా రాణించి, తమ తమ మ్యాచ్‌లలో విజయం సాధించి సెమీఫైనల్స్‌లో స్థానం దక్కించుకున్నారు.

మీనాక్షి జపాన్‌కు చెందిన యుకా సదామత్సును 5-0 ఏకగ్రీవంగా ఓడించగా, జాస్మిన్ చైనాకు చెందిన జియి చెన్‌ను 5-0 తేడాతో ఓడించి సెమీఫైనల్స్‌కు చేరుకుంది.

శనివారం అంతకుముందు, నిఖత్ జరీన్, ప్రియా ఘంగాస్, ప్రీతి పవార్ కూడా తమతమ క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లలో గెలిచి సెమీ-ఫైనల్స్‌కు చేరుకున్నారు.

లోకేష్, ఆకాష్, హర్ష్ ముందంజ..

ఇక పురుషుల విభాగంలో, భారత బాక్సర్లు అద్భుతంగా రాణించి సెమీ-ఫైనల్స్‌లో స్థానం కోసం తమ బెర్త్ లు ఖాయం చేసుకున్నారు. 85 కేజీల విభాగంలో, లోకేష్ కొరియాకు చెందిన గిచే కిమ్‌ను 5-0 తేడాతో ఓడించి తదుపరి రౌండ్‌కు చేరుకున్నాడు. ఆకాష్ తుర్క్‌మెనిస్తాన్‌కు చెందిన యల్హాస్ బగ్తైరోవ్‌ను 5-0 తేడాతో ఓడించాడు.

ఇది కాకుండా, హర్ష్ చౌదరి కిర్గిజ్ రిపబ్లిక్‌కు చెందిన టినిస్తాన్ అలీబాయేవ్‌ను ఓడించి సెమీఫైనల్స్‌లో తన స్థానాన్ని సురక్షితం చేసుకున్నాడు.

అయితే, 80 కేజీల వెయిట్ కేటగిరీలో జోర్డాన్‌కు చెందిన హుస్సేన్ ఇషాష్ చేతిలో ఓటమి పాలైన అంకుష్, టోర్నమెంట్ నుండి నిష్క్రమించాల్సి వచ్చింది. అదేవిధంగా, 50 కేజీల విభాగంలో విశ్వనాథ్ సురేష్, 60 కేజీల విభాగంలో సచిన్ కూడా విజయం సాధించి సెమీఫైనల్స్‌లో తమ స్థానాలను సురక్షితం చేసుకున్నారు.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story