IND vs PAK: ఆసియా క్రీడల్లో భారత్‌ మరో స్వర్ణం.. పాక్‌ను చిత్తు చేసిన శ్రేయస్‌ సేన!

IND vs PAK: ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి భారత్ స్వర్ణ పతకం సాధించింది. భారత్ పతకాల సంఖ్య 81కి చేరిన పూర్తి వివరాలు.

Arun Chilukuri
Published on: 3 Oct 2026 2:24 PM IST
IND vs PAK
X

IND vs PAK: ఆసియా క్రీడల్లో భారత్‌ మరో స్వర్ణం.. పాక్‌ను చిత్తు చేసిన శ్రేయస్‌ సేన!

IND vs PAK: ఆసియా క్రీడల్లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. పురుషుల క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో దేశానికి మరో పసిడి పతకాన్ని అందించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన హోరాహోరీ ఫైనల్ మ్యాచ్‌లో శ్రేయస్ నాయకత్వంలోని టీమ్‌ఇండియా ఘన విజయం సాధించి 'గోల్డ్‌'తో మెరిసింది. ఈ విజయంతో ఆసియా క్రీడల్లో భారత్‌ మొత్తం పతకాల సంఖ్య 81కి చేరింది. ఇందులో 19 స్వర్ణాలు, 26 రజతాలు, 36 కాంస్య పతకాలు ఉన్నాయి.

ఫైనల్ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 212 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్థాన్ జట్టు.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 192 పరుగులకే పరిమితమైంది. పాక్ బ్యాటర్ హసన్ నవాజ్‌ (96 పరుగులు) చివరి వరకు ఒంటరి పోరాటం చేసినప్పటికీ భారత్ విజయాన్ని అడ్డుకోలేకపోయాడు.

చివరకు భారత్ 19 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో భారత్ స్వర్ణం సాధించగా, పాకిస్థాన్‌ రజత పతకంతో సరిపెట్టుకుంది. ఇక మూడో స్థానం కోసం జరిగిన పోరులో బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన శ్రీలంక కాంస్య పతకాన్ని దక్కించుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.